Moviesబాల‌య్య - అనిల్ రావిపూడి సినిమాలో ఆ క్రేజీ హీరో... షాకింగ్‌...

బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమాలో ఆ క్రేజీ హీరో… షాకింగ్‌ స‌ర్‌ఫ్రైజ్‌…!

టాలీవుడ్‌లో నంద‌మూరి కాంపౌండ్ హీరో క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన అనిల్ రావిపూడి వ‌రుస స‌క్సెస్‌ల‌తో తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు. ఇప్ప‌టికే అనిల్ ఖాతాలో నాలుగు వ‌రుస స‌క్సెస్‌లు ఉన్నాయి. చివ‌రిగా మ‌హేష్‌బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన అనిల్‌… ఇప్పుడు ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌కు సీక్వెల్‌గా రూపొందించిన ఎఫ్ 3 సినిమాతో మ‌రోసారి త‌న ల‌క్ ప‌రీక్షించుకోబోతున్నాడు. ఎఫ్ 2 టీంతో తెర‌కెక్కిన ఎఫ్ 3 సినిమా ఈ నెల 27న థియేటర్ల‌లోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా పూర్త‌యిపోవ‌డంతో అనిల్ రావిపూడి నెక్ట్స్ నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలోనే అనిల్ రావిపూడి – బాల‌య్య కాంబినేష‌న్లో రామారావు గారు అనే టైటిల్‌తో ఓ సినిమా అనుకున్నారు. కొన్ని కారాణాల వల్ల అది ప‌ట్టాలు ఎక్క‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఈ హిట్ డైరెక్ట‌ర్ – బాల‌య్య కాంబినేష‌న్లో సినిమా ప‌ట్టాలు ఎక్కుతుండ‌డంతో నంద‌మూరి అభిమానుల జోష్ మామూలుగా లేదు.

జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న‌ట్టు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాలో బాల‌య్య‌తో పాటు మ‌రో హీరో కూడా న‌టిస్తాడ‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మ‌రో న్యూస్ వినిపిస్తోంది. ఆ హీరో ర‌వితేజ కాద‌ని.. న‌వీన్ పోలిశెట్టి అని తెలుస్తోంది. న‌వీన్ పోలిశెట్టి పాత్ర ఇంట‌ర్వెల్‌లో వ‌స్తుంద‌ట‌.

సినిమా ఫ‌స్టాఫ్ అంతా చాలా సీరియ‌స్‌గా న‌డుస్తుంద‌ట‌. సినిమా ఇంట‌ర్వెల్ టైంకు ఫుల్ కామెడీగా ట‌ర్న్ అవుతుంద‌ని… క‌రెక్టుగా అదే టైంలో నవీన్ పోలిశెట్టి పాత్ర ఎంట్రీ ఉంటుంద‌ని తెలుస్తోంది. అనిల్ రావిపూడి అంటేనే కామెడీ, యాక్ష‌న్ ట‌చ్ చేస్తాడు. ఇప్పుడు బాల‌య్య స్టైల్‌కు అనుగుణంగానే యాక్ష‌న్‌, ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో పాటు త‌న‌దైన స్టైల్ కామెడీ మిక్స్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news