Moviesరష్మిక చెల్లి ని చూశారా..వైరల్ అవుతున్న ఫ్యామిలీ పిక్..!!

రష్మిక చెల్లి ని చూశారా..వైరల్ అవుతున్న ఫ్యామిలీ పిక్..!!

రష్మిక మందన్న.. ఈ పేరు కన్నా కూడా ఆమెని క్రష్మిక అన్న పేరుతో నే అభిమానులు ఎక్కువుగా నోటీస్ చేస్తుంటారు. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే ..స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరడమే కాకుండా..సినిమా సినిమాకి తన రేంజ్ తో పాటు రెమ్యూనరేషన్ ని కూడా పెంచుకుంటూ పోతుంది. సినిమా కధల విషయంలో ఆచి తూచి సెలక్ట్ చేసుకునే ఈ అమ్మడు..అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ మధ్యలో టాలీవుడ్ అన్నీ భాషలను కవర్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా చలామణీ అవుతుంది.

ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ..ఎక్కడ తన కెరీర్ కి బేకులు వేయకుండా రైయ్ రైయ్ మని దూసుకుపోతుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..ప్రజెంట్ బాలీవుడ్ లో మూడు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో ఒక సి నిమాకి కమిట్ అయ్యి ఉంది. మొదటి సినిమానే మంచి హిట్ కొట్టడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో వచ్చిన క్రేజ్ తో కోలీవు, బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. అందానికి అందం, నటనకు నటనతో ఆకట్టుకుంటూ.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో జతకట్టి..మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ పిక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కానీ రష్మిక కి ఇంత చిన్న చెల్లెలు ఉందా అంటూ ఆశ్చర్య పోతున్నారు జనాలు. ఎప్పుడు తన ఫ్యామిలీ గురించిన పిక్స్, విషయాలను షేర్ చేసుకోని రష్మిక ఇలా సడెన్ గా ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేయడం ఒక్క షాకింగ్ అయితే..ఇంత చిన్న చెల్లెలు రష్మిక కి ఉందటం మరో షాకింగ్ ఉంది. ఇదే ప్రశ్న అడుగుతున్నారు అభిమానులు ఆమెని సోషల్ మీడియా వేదికగా..మరి చూడాలి రష్మిక ఎలా రిప్లై ఇస్తుందో..

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news