Moviesస‌మంత ఇంట్లో 6 ల‌గ్జ‌రీ కార్లు... వామ్మో ఇంత కాస్ట్‌లీనా...!

స‌మంత ఇంట్లో 6 ల‌గ్జ‌రీ కార్లు… వామ్మో ఇంత కాస్ట్‌లీనా…!

సెల‌బ్రిటీల లైఫ్‌స్టైల్ ఎంత ల‌గ్జ‌రీగా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. వాళ్లు ఏం వాడినా కూడా అవి టాప్ రేంజ్‌లో ఉంటాయి. వాళ్ల ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, కార్లు, డ్రెస్సులు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ల లైఫ్ చాలా హై కాస్ట్‌లీగా ఉంటుంది. ఇక సినిమా సెల‌బ్రిటీల లైఫ్ స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారి చాలా విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతూ ఉంటారు. హీరోల కంటే హీరోయిన్లు వేసుకునే డ్రెస్సుల నుంచి, వాళ్ల కాస్ట్యూమ్స్ నుంచి అన్ని ఓ రేంజ్‌లో ఉంటాయి.

ఇక సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న స‌మంత లైఫ్ సైతం ఎంత ల‌గ్జ‌రీగా ఉంటుందో కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. స‌మంత హీరోయిన్‌గా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న‌ప్పుడే అటు బెంగ‌ళూరు, చెన్నైతో పాటు హైద‌రాబాద్‌, వైజాగ్‌లో భారీగా ఆస్తులు కూడ‌బెట్టుకుంది. చెన్నై, హైద‌రాబాద్‌లో ఆమె విల్లాలు, ప్లాట్లు ఉన్నాయి. ముంబైలో సైతం ఆమె ఓ ప్లాట్ కొనుగోలు చేసింది.

వైజాగ్‌లోనూ రియ‌ల్ ఎస్టేట్ల‌లో ఆమె కొన్ని పెట్టుబ‌డులు అయితే పెట్టింది. ఏ మాయ చేశావే సినిమాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన స‌మంత ఆ త‌ర్వ‌త తెలుగు, త‌మిళంతో పాటు క‌న్న‌డం, హిందీలోనూ త‌క్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక స‌మంత ల‌గ్జ‌రీ లైఫ్ విష‌యానికి వ‌స్తే ఆమె వేసుకునే బ్యాగులు, చెప్పులు, న‌గ‌లు అయితే ల‌క్ష‌ల్లోనే ఉంటాయ‌ట‌.

స‌మంత డ్రెస్సులు పైకి చూడ‌డానికి కాస్త అస‌భ్యంగా అనిపించినా వాటి కోసం కూడా ఆమె ల‌క్ష‌ల్లోనే ఖ‌ర్చు చేస్తుంద‌ట‌. ఇక స‌మంత ల‌గ్జ‌రీ కార్లు బాగా ఇష్ట‌ప‌డుతుంది. ఆమె ద‌గ్గ‌ర ఒక‌టి కాదు రెండు కాదు ఆరు ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయ‌ట‌. అస‌లు ఆ కార్లు ఏంటి ? వాటి ధ‌ర ఏంటో చూస్తేనే షాక్ అవ్వాల్సిందే. స‌మంత వ‌ద్ద ఉన్న ల‌గ్జ‌రీ కార్ల‌లో జాగ్వార్ ఎక్స్ ఎఫ్ కూడా ఉంది. దీని రేటు రు. 72 ల‌క్ష‌లు పై మాటే.

అలాగే స‌మంత వ‌ద్ద ఆడి క్యూ 7 కారు ఉంది. దీని రేటు రు. 83 ల‌క్ష‌లు. అలాగే 1.46 కోట్లు విలువ చేసే స్వాంకీ పోర్చే కేమ‌న్ కారు కూడా స‌మంత ద‌గ్గ‌ర ఉంది. ఇక స‌మంత వ‌ద్ద 2.26 కోట్ల రేంజ్ రోవ‌ర్ కారు కూడా ఉంది. ఇక స‌మంత బాగా ఇష్ట‌ప‌డే మెర్సిడీస్ బెంజ్ కారు రేటు రు 1.42 కోట్లు. ఈ కార్ల రేట్లు చూస్తేనే స‌మంత కార్ల కోసం ఏ స్థాయిలో ఖ‌ర్చు చేస్తుందో అర్థ‌మ‌వుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news