Moviesతన కెరీర్ లో మహేష్ బాబుకు నచ్చని ఏకైక సినిమా ఇదే..!!

తన కెరీర్ లో మహేష్ బాబుకు నచ్చని ఏకైక సినిమా ఇదే..!!

సినీ ఇండస్ట్రీలో యువరాజు ఎవరు అంటే సెకండ్ కూడా ఆలోచించకుండా అందరు టక్కున చెప్పే పేరు..మహేష్ బాబు. ఆ పేరులోనే ఏవో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి. పేరే కాదు సార్ కూడా చాలా హ్యాండ్ సమ్. ఏజ్ 40+ దాటినా ..చూడటానికి 29 లా కనిపిస్తాడు. అందుకే అమ్మాయిలకు ఎప్పుడు రాజకుమారుడే ఈ హీరో. అసలు వయసు ఎంతున్నా.. చూడ్డానికి మాత్రం ఏం ఉన్నాడ్రా బాబూ అనేట్టుగా ఉంటాదు మహేష్. అందుకే అంత క్రేజ్, ఫాలోయింగ్ అన్నమాట. ఈ విషయంలో మహేష్ బాబు నెం 1..కింగ్ అనే చెప్పాలి. వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి, ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా పిలవబడుతున్న గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ఈ సూపర్‌ స్టార్‌.

సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ‘రాకుమారుడు’.. తనదైన నటనతో టాలీవుడ్‌ ‘యువరాజు’గా వెలుగొందుతున్నాడు. అంతేకాదు ‘టక్కరి దొంగ’గా మారి అమ్మాయిల మనసును దోచుకున్నాడు. ‘అతిథి’లా అప్పుడప్పుడు కాకుండా ‘దూకుడు’గా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘వన్‌’అండ్‌ ఓన్లీ ‘మహర్షి’. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. కొన్ని హిట్ అయ్యాయి..మరి కొన్ని ఫ్లాప్ అయాయి. కానీ ఫ్లాప్ అయిన ప్రతిసారి మహేష్ క్రుంగి పోకుండా డబుల్ స్పీడ్ తో హ్యాట్రిక్ హిట్లు కొట్టుకుంటూ ..ఎప్పటికప్పుడు తనలోని తప్పు ఒప్పులను సరిదిద్దుకుంటూ వచ్చాడు.

అయితే, మహేష్ బాబు కి తన కెరీర్ లో తాను చేసిన సినిమాల్లో నచ్చని సినిమా ఏదైనా ఉంది అంటే అది.. సైనికుడు మూవీనేనట. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై మహేష్ బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నాదు. పేదలకి సహాయం అంటూ వచ్చిన కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది. కానీ ఎందుకో ఈ సినిమాలో మహేష్ బాబు ని విలన్ గా చూయించారు అన్న మాటలు వినిపించాయి. ముఖ్యం గా త్రిషనే హైలెట్ చేశారు ఈ సినిమాలో అంటూ అప్పట్లోనే ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. పైగా సినిమా అడ్రెస్ లేకుండా పోయింది.

వరుస హిట్లతో నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్న ఈ ఆరడుగుల అందగాడు ప్రస్తుతం..పరశూరాం డైరెక్షన్ లో సర్కారు వారిపాట అనే సినిమా చేస్తున్నాడు. ఆల్ మోస్ట్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిన్నట్లే. త్వరలోనే గంట మొగించడానికి మనముందుకు రాబోతున్నాడు ఈ ఘట్టమనేని వారసుడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news