Movies' స‌ర్కారు వారి పాట ' అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది.. !

‘ స‌ర్కారు వారి పాట ‘ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది.. !

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి రెండేళ్లు దాటిపోయింది. 2020లో వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్ న‌టించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. మ‌ధ్య‌లో క‌రోనా రావ‌డంతో రెండేళ్లు మ‌హేష్ ఖాళీగానే ఉన్నాడు. 2020 క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో మ‌హేష్‌కు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ఉన్నా.. 2021 ఇయ‌ర్ అంతా ఖాళీగానే ఉంది. ఇక ఇప్పుడు రెండున్న‌రేళ్ల‌కు స‌ర్కారు వారి పాట సినిమాతో గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

గీత‌గోవిందం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత దర్శ‌కుడు ప‌ర‌శురాం డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో పాటు మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ లాంటి క్రేజీ హీరోయిన్ న‌టించ‌డం.. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజ‌ర్లు, సాంగ్స్ అద‌ర‌గొట్టేస్తూ ఉండ‌డంతో ఖ‌చ్చితంగా సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న అంచ‌నాలు అయితే భారీగానే ఉన్నాయి. పైగా మ‌హేష్ – కీర్తి సురేష్ కాంబినేష‌న్లో తొలి సినిమా కావ‌డంతో పాటు ఈ ఇద్ద‌రి క్యూట్ లుక్స్ క్లాసీ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేస్తున్నాయి.

ఇక సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు వ‌చ్చే నెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మైత్రి మూవీ మేకర్స్ – GMB ఎంటర్ టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ పతాకంపై తెర‌కెక్కే ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుందా ? అన్న ఉత్కంఠ ఒక్క‌టే ఉంది. తాజాగా ట్రైల‌ర్ కోసం వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ మేక‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఈ ట్రైల‌ర్‌ను మే 2న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ కూడా ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. మాసివ్ బ్లాస్ట‌ర్ స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్‌ను ఓ రేంజ్‌లో క‌ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ట్రైల‌ర్ చూస్తే సినిమాపై అంచ‌నాలు డ‌బుల్ అయిపోతాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చిన సాంగ్స్ మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news