Moviesవిడాకుల కోసం కోర్టుకి ఎక్కి రచ్చ చేసిన రంభ యూట‌ర్న్ వెన‌క...

విడాకుల కోసం కోర్టుకి ఎక్కి రచ్చ చేసిన రంభ యూట‌ర్న్ వెన‌క స్టార్ హీరో…!

అందరికీ ఆమె కేరాఫ్ అడ్రస్.. నిజంగానే భువి నుంచి దివికి దిగివచ్చిన అతిలోక సుందరిగా ఉంటుంది ఆ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా తన గ్లామర్తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. 1990లలో స్టార్ హీరోయిన్‌గా దశాబ్దకాలం పాటు తన హవా నడిపించింది. కేవలం తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా టాప్ హీరోలందరి సరసన నటించింది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకుల చూపు మొత్తం తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. అందుకే ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. మరి మనందరికీ తెలిసిన రంభ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

తన అందం అభినయంతో ఎంతోమంది మనసులు కొల్లగొట్టిన హీరోయిన్ రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఇక ఈమె స్వస్థలం కూడా ఏపీలోని విజయవాడ కావడం గమనార్హం. అయితే ఈ అమ్మడి చిన్నప్పటి నుంచి సినిమాలంటే తెగ పిచ్చి. దీంతో ఇక సినిమా అవకాశాల కోసం తిరగ్గా.. చివరికి ఒక మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా అవతారమెత్తింది. ఇక ఆ సినిమాతో విజయలక్ష్మి కాస్త అమృత అనే పేరుతో వెండితెరకు పరిచయం అయింది.

ఇక ఆ తర్వాత తెలుగులో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో విజయలక్ష్మి అలియాస్ అమృత కాస్త చివరికి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

ఇక గ్లామర్ బ్యూటీగా తన హవా తెలుగు చిత్ర పరిశ్రమలో నడిపించింది రంభ. అయితే కన్నడలో రజినీకాంత్, కమల్, అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – బాలయ్య సరసన కూడా నటించింది. చిరంజీవితోనే ఎక్కువగా సినిమాల్లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఏడు భాషల్లో దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించింది రంభ. అల్లుడా మజాకా, హిట్లర్, బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, మెకానిక్ మామయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు మరిన్ని సినిమాల్లో నటించింది.

అదే సమయంలో భైరవద్వీపం, హలో బ్రదర్ లలో స్పెషల్ సాంగ్‌లో నర్తించింది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగ, యమదొంగ, దేశముదురు లాంటి సినిమాల్లో సైతం స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. 2003లో త్రీ రోజెస్ సినిమాను నిర్మించింది. జ్యోతిక – లైలా – రంభ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 2010లో కెనడా వ్యాపారవేత్త ఇంద్ర‌న్ పద్మనాభన్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకానొక టైంలో భ‌ర్త‌తో తీవ్ర‌మైన విబేధాలు వ‌చ్చాయి. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు కోర్టు మెట్లు కూడా ఎక్కింది.

వీరు విడిపోతార‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే పిల్ల‌ల కోసం మ‌న‌స్ప‌ర్థ‌లు పెట్టి క‌లిసి ఉండాల‌ని.. దాంప‌త్య జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సంఘ‌ర్ష‌ణ‌లు కామ‌న్ అని చెప్ప‌డంతో చివ‌ర‌కు రంభ – ఇంద్ర‌కుమార్ మ‌ళ్లీ క‌లిసిపోయారు. మెగాస్టార్ చిరంజీవి సైతం రంభ‌కు స్వ‌యంగా ఫోన్ చేసి.. విడాకుల నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోర‌డంతో పాటు ఇటు కుటుంబ స‌భ్యుల ఒత్తిళ్ల నేప‌థ్యంలో రంభ ఇప్పుడు భ‌ర్త‌తో క‌లిసిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news