Moviesరష్మిక రేటు..అరగంటకు కోటి..ఏ సినిమాకంటే..?

రష్మిక రేటు..అరగంటకు కోటి..ఏ సినిమాకంటే..?

రష్మిక..ఓ క్యూట్..స్మైల్..హాట్ బేబీ..అని అంటుంటారు ఆమె అభిమానులు. ఛల్లో సినిమా చ్హుసిన తరువాత అమ్మడు కి ఈ స్దాయి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని కనీసం ఆమె కూడా అనుకోని ఉందదు. అంత లా క్రేజీ క్రేజీ డీల్స్ పట్టి..స్టార్ హీరో లతో సినిమాలు చేసి..టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. రీసెంట్ గా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్దాయిలో గుర్తింపు పొందిన ఈమె..ప్రస్తుతం అటు కోళీవుడ్, బాలీవుడ్..ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

అంతేకాదు..మన పెద్దవాళ్ళు చెప్పే సామెతను బాగా ఫాలో అవుతుంది. దీపం ఉన్నప్పుడే ఇళ్ళు చక్కదిద్దుకోవాలి..క్రేజ్ ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ పెంచేసి నాలుగు రాళ్ళు వెనక వేసుకోవాలి. అందుకే పుష్ప సినిమా తరువాత అమ్మడు తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది. పుష్ప 2 కి కూడా రష్మిక భారీ గా డిమాండ్ చేస్తుందట. అమ్మడు అడిగిన తెటు కి సుకుమార్ సైతం షాక్ అయ్యిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ మధ్యనే రష్మిక కు ఓ క్రేజీ సూపర్ ఆఫర్ తలుపుతట్టిందట. అయితే, అమ్మడు మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూ..షాక్ ఇచ్చింది. మనకు తెలిసిందే, చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని..ఆ సినిమలో హీరోయిన్లుగా అంజలి, కియరా అద్వాని నటిస్తున్నారని. కాగా ఈ సినిమాలో ఓ కీలక మైన జర్నలిస్ట్ పాత్ర ఒకటి ఉందట.

ఆ పాత్రకు రష్మిక అయితే బాగుంటుందని దిల్ రాజు ఆమెను అప్రోజ్ అయితే.. అమ్మడు ఒకేఅ చేసిందట కానీ, ఆ కొద్ది సేపు పాత్రకే ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. నిజానికి అమ్మడుకు మూడు షాట్లకిమించి ఉండవట..ఈ విషయానే దిల్ రాజు రష్మిక కి కూడా చెప్పారట కానీ, ప్రస్తుతం ఆమెకు ఉన్న డిమాడ్ కు ఇంత చార్జ్ చేస్తున్నా అని చెప్పి దిల్ రాజుకే దిమ్మ తిరిగేలా చేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా రష్మిక డిమాండ్స్ మామూలుగా లేవు ..కొంచెం తగ్గించుకుంటే మంచిదంటున్నారు జనాలు. మరి అమ్మడు తగ్గించుకుంటుందంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news