Moviesహవ్వా..ఎంతమాట..సమంతలో ఉన్నది..తమన్నాలో లేనిది అదే..?

హవ్వా..ఎంతమాట..సమంతలో ఉన్నది..తమన్నాలో లేనిది అదే..?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్ట్ కొనసాగుతున్న తమన్నా-సమంతల పేరులు..ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశం గా మారాయి. దానికి కారణం రీసెంట్ గా తమన్నా ఐటెం సాంగ్ గా చేసిన గని మూవీనే. మనకు తెలిసిందే నెటి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేస్తూనే..ఐటెం సాంగ్ లో కూడా చిందులేస్తున్నారు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సుందరిమణులు. ఆ లిస్ట్ లో కే వస్తారు తమన్నా, శృతి హాసన్, అంజలి, పూజా హెగ్డే, సమంత..

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా..ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే నో చెప్పరు. రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుందనో లేక..బాగా పాపులర్ అవ్వచు అనో తెలియదు కానీ.. అలాంతి స్పెషల్ సాంగ్ లో చాలా మంది ముద్దుగుమ్మలు చిందులేసి..చించేశారు. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే అందరికి గుర్తువచ్చేది..”బావలు సై యా..సై మరదలు సై యా” ఈ పాట వస్తే మంచంలో ఉన్న మూసల ఆయన అయినా సరే..లేచి ఊపు ఊపాల్సిందే అంత హైలెట్ అయ్యింది ఈ పాట.

ఇక అదే రేంజ్ లో ఈ మధ్య ఊపు తెప్పించిన పాట ఏదైన ఉంది అంటే..అది కేవలం సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్..”ఊ అంటావా మావా..ఊ ఊ అంటావా మావా” అనే పాట. వాయబ్బో ఈ పాట సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. చిన్న పిల్లలు సైతం ఈ పాట కి ఓ రేంజ్ లో స్టెప్పులేస్తున్నారు. అయితే ఇప్పుడు సమంత పాటతో..తమన్నా పాటను కంపేర్ చేస్తూ..ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. సమంత లో ఉన్న ఆ పస తమన్నాలో లేదు అని..తమన్నా చాప్టర్ అయిపోయిందని..తమన్నా ఆంటీ రోల్ కే సెట్ అవుతుందని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి గని సినిమాలో తమన్నా పాట ఆమె పరువు తీసేస్తుంది..పాపం బ్యాడ్ టైం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news