Moviesదిల్‌రాజు తెలివైనోడే...పూజా హెగ్డే తో మైండ్ బ్లోయింగ్ డీల్.. ?

దిల్‌రాజు తెలివైనోడే…పూజా హెగ్డే తో మైండ్ బ్లోయింగ్ డీల్.. ?

దిల్ రాజు ..ప్రస్తుతం టాలీవుడ్ ని శాసిస్తున్న వన్ ఆప్ద్ ది స్టార్ నిర్మాత. అబ్బో ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పేకొద్ది ఇంకా ఏదో చెప్పలి అనిపించే బోలెడు చరిత్ర ఉంది సార్ కి. డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 2003లో దిల్ సినిమాతో నిర్మాత‌గా మారి.. ఈ రోజు ఇండ‌స్ట్రీని శాసించే వ్య‌క్తుల్లో ఆయ‌న కూడా ఒక‌రుగా ఉన్నారు అంటే దాని వెనుక ఆయన కష్టం..ఆయన కి ఉన్న టాలెంట్..ఆయన తెలివితేటలు అని మనం అర్ధం చేసుకోవచ్చు.

డిస్ట్రిబ్యూష‌న్‌, నిర్మాత‌గా, ఎగ్జిబిట‌ర్‌, థియేట‌ర్ల సిండికేట్‌లో ఒక కీల‌క వ్య‌క్తిగా దిల్ రాజునే ది బేస్ట్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ ఉంది. రాజు ప్లానింగ్ మామూలుగా ఉండ‌దట. కొన్ని సంవ‌త్స‌రాలుగా సినీ ఇండస్ట్రీలో ఆయ‌న హ‌వా న‌డుస్తోన్న సంగతి తెలిసిందే. పెద్ద హీరోలు, ద‌ర్శ‌కుల‌తో క్రేజీ కాంబినేష‌న్లు సెట్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. రాజు ప్లానింగ్ మామూలుగా ఉండ‌దు. బ‌డా బ‌డా ప్రాజెక్టుల‌ను మంచి నీళ్లు తాగినంత సులువుగా సెట్ చేసి ప‌డేస్తారు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాని వెన‌క ఆయ‌న లెక్క‌లు వేరేగానే ఉంటాయి.

అయితే తాజాగా దిల్ రాజు తీసుకున్న నిర్ణయం చూసి ఇండస్ట్రీ పెద్దలే షాక్ అవుతున్నారు. నువ్వు మామూలోడివి కాదయ్యో అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఆయ‌న నిర్మిస్తోన్న చిత్రాల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న చిత్రం F3. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తోన్న సినిమా ఇది. అయితే F3 సినిమా విష‌యంలో దిల్‌రాజు హిట్ కొట్టాల‌ని బ‌లంగా అనుకుంటున్నారు.

అందు కోసమే ఆయన కొత్త కొత్త స్ట్రాట‌జీలు ఫాలో అవుతున్నారట. F2లో ఉన్న తారాగ‌ణంకు ఎక్స్‌ట్రా యాడ్ చేస్తూ మరింత మాస్ మసాలా యాడ్ చేస్తున్నారని టాక్. కాగా.. ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న లేటెస్ట్ స‌మాచారం మేర‌కు F3 గ్లామ‌ర్ డోసు పెంచడానికి దిల్ రాజు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను ప్లాన్ చేశార‌ట‌. ఇప్పటికే పూజా కాల్ షీట్లు బుక్ చేసుకున్న ఆయన త్వరలోనే పాటను షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రాజు గారి టైమింగ్ సూపర్ అంటున్నారు సినీ లవర్స్. మరి చూడాలి పూజా ఏమేర మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news