Moviesచైతుకు సెకండ్ మ్యారేజ్‌...ఆ కుటుంబంతోనే నాగార్జున కొత్త వియ్యం..!

చైతుకు సెకండ్ మ్యారేజ్‌…ఆ కుటుంబంతోనే నాగార్జున కొత్త వియ్యం..!

నిజ‌మో అబ‌ద్ధ‌మో గాని ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల్లో ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ అయితే బ‌య‌ట బాగా వైర‌ల్ అవుతోంది. అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట ఆరేడేళ్లుగా తెలుగు మీడియాలోనే కాకుండా నేష‌న‌ల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్‌గా మారామో చూస్తూనే ఉన్నాం. అస‌లు అక్కినేని ఇంట కోడ‌లిగా వెళ్లాలంటే ఎంతో పెట్టి పుట్టి ఉండాలి. ఆ అదృష్టం చెన్నై చిన్న‌ది స‌మంత‌కు ద‌క్కింది. తెలుగు సినిమా రంగంలో 70 ఏళ్ల చ‌రిత్ర‌తో పాటు మంచి పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న ఆ కుటుంబంలోకి కోడ‌లిగా వెళ్లిన స‌మంత‌.. చైతుతో జీవితాంతం క‌లిసి ఉంటే చ‌రిత్ర‌కు ఎక్కిపోయి ఉండేది. ఆమె పేరు తెలుగు గ‌డ్డ‌పై చిర‌స్థాయిగా నిలిచి ఉండేది.

బ్యాడ్ ల‌క్ ఆమె ఆ ఫ్యామిలీ కోడ‌లిగా నాలుగేళ్లు మాత్ర‌మే కొన‌సాగింది. ఇక గ‌తేడాది అక్టోబ‌ర్ 2న చైతు, స‌మంత అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల‌కు ముందు నాలుగు నెల‌ల నుంచే స‌మంత బిహేవియ‌ర్‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఆమె పెట్ట‌కుంటూ వ‌స్తోన్న పోస్టులు చూసే చాలా మంది ఏదో తేడా కొడుతోంద‌న్న సందేహాలు వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు వారు ఊహించిందే జ‌రిగింది.

విడాకుల త‌ర్వాత కూడా ఈ జంట‌పై అనేకానేక రూమ‌ర్లు వ‌చ్చాయి. అయితే చైతు మాత్రం పెద్ద‌గా ఈ విష‌యంలో రియాక్ట్ కాలేదు. త‌న ప‌నేదో తాను చేసుకుపోయాడు. అయితే స‌మంత మాత్రం ఎప్పుడూ ఏదో అర్థం వ‌చ్చేలాగానే పోస్టులు పెడుతూ వ‌చ్చింది. స‌రే ఎవ‌రి దారుల్లో వారు ఉన్నారు. విడాకుల త‌ర్వాత ఎవ‌రికి వారు సినిమాల్లో బిజీ అయిపోయారు. చైతు బంగార్రాజు రిలీజ్ అయ్యింది.

బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో క‌లిసి లాల్‌చ‌ద్దా సినిమా చేస్తున్నాడు. స‌మంత కూడా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చైతుకు సెకండ్ మ్యారేజ్ చేసేందుకు నాగార్జున సిద్ధ‌మైపోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చైతు త‌న సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో నాగార్జున కూడా ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌లేదు. గ‌తంలో అఖిల్ – చైతు మ్యారేజ్‌ల‌ను ఒకేసారి చేసేయాల‌ని నాగ్ అనుకున్నాడు.

అప్పుడు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు చైతు పెళ్లి కుదిరిపోయింది. ఓ హీరోయిన్‌తో చైతు ప్రేమ‌లో ఉన్నాడ‌న్న పుకార్లు వ‌చ్చినా అవి వాస్త‌వాలు కాదు. విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ల కుటుంబానికి చెందిన యువ‌తితో చైతు సెకండ్ మ్యారేజ్ జ‌ర‌గ‌నుంద‌ట‌. ఆ యువ‌తి అమెరికాలో ఎంబీయే పూర్తి చేసింది. ఈ సారి నాగార్జున త‌న సొంత సామాజిక వ‌ర్గమైన క‌మ్మ వ‌ర్గానికి చెందిన సంప్ర‌దాయ కుటుంబంతోనే వియ్యం అందుకోబోతున్నాడు.

ఏదేమైనా చైతు ఎంతో ఇష్ట‌ప‌డ్డ తొలి మ్యారేజ్ లైఫ్ అనుకున్న‌ట్టుగా స‌క్సెస్ కాలేదు. అదో పీడ‌క‌ల‌గా మిగిలిపోయింది. రెండో మ్యారేజ్‌తో అయినా చైతు వైవాహిక బంధం మూడు పువ్వులు.. ఆరు కాయ‌లుగా కొన‌సాగితే అంత‌క‌న్నా ఆనందం ఏం ? ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news