Moviesసేమ్ టు సేమ్ బాల‌య్య‌ను ఫాలో అవుతోన్న మ‌హేష్‌..!

సేమ్ టు సేమ్ బాల‌య్య‌ను ఫాలో అవుతోన్న మ‌హేష్‌..!

బాల‌య్య అఖండ జాత‌ర ఇంకా ఆగ‌డం లేదు. ప్ర‌తి రోజు తెలుగు గ‌డ్డ‌పై అఖండ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంటున్నారు. ఫ్యాన్స్ పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తూనే ఉంటున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వీడియోలే అందుకు నిద‌ర్శ‌నం. బాల‌య్య అభిమానులు త‌మ అభిమాన హీరో సినిమాలో పాపుల‌ర్ డైలాగ్‌నో లేదా సాంగ్‌నో ప‌దే ప‌దే పాడుకుంటూ ఉంటారు. బాల‌య్య డైలాగులు చెపుతున్నా… బాల‌య్య డ్యాన్సులు వేస్తున్నా జై బాల‌య్య అనేది నంద‌మూరి అభిమానులకు ఓ ఎన‌ర్జిటిక్ మంత్రి అయిపోయింది.

దీనికి తోడు అఖండ సినిమాలో గీతా మాధురి పాడిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ జై బాల‌య్యా వ‌చ్చాక ఎవ‌రి నోట విన్నా జై బాల‌య్యా అన్నది ఓ తార‌క‌మంత్రంగా మారిపోయింది. అఖండ విజ‌యంలో జై బాల‌య్య అనేది యా యా యా జై బాల‌య్యా అనేది హైలెట్ అయ్యింది. అయితే ఇప్పుడు బాల‌య్య స్టైల్‌నే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు కూడా ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌హేష్‌బాబు తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌. ఇప్ప‌టికే 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ పేరు వ‌చ్చేలా ఓ మాస్ బీట్ రెడీ అవుతోంద‌ట‌. మా మా మా మ‌హేషు అంటూ అచ్చం జై బాల‌య్య స్టైల్లో ఈ సాంగ్‌ను రెడీ చేస్తున్నార‌ట‌.

గ‌తంలోనే చిరు – బాల‌య్య – నాగార్జున లాంటి హీరోల సినిమాల్లో వాళ్ల పేర్ల‌తో సాగు పాట‌లు ఇప్ప‌ట‌కీ హ్యూజ్ హిట్‌గానే ఉంటాయి. మ‌న గాయకుల నోళ్ల‌లో నానుతూనే ఉంటాయి. ఈ సాంగ్స్ ఎప్ప‌ట‌కీ ఎవ‌ర్ గ్రీన్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చాయి. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో మ‌హేష్‌బాబుపై పేరు వ‌చ్చేలా ఓ సాంగ్‌ను రెడీ చేస్తుండ‌డంతో సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతోంది ఈ వార్త‌.

ఈ సాంగ్‌ను మ‌హేష్ బాబు – కీర్తి సురేష్‌పై రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీక‌రిస్తున్నారు. 2020 సంక్రాంతికి వ‌చ్చిన మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత న‌టిస్తోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన క‌ళావ‌తి – ఎవ్రీ పెన్నీ సాంగ్స్‌తో పాటు మ‌హేష్‌బాబు పేరుతో సాగే సాంగ్ ఇవ‌న్నీ సినిమాలో హైలెట్ కానున్నాయ‌ని తెలుస్తోంది. సముద్రఖని వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బ్యాంకుల కుంభ‌కోణం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news