Moviesఅనిల్ రావిపూడితో త‌మ‌న్నాకు గొడ‌వ ... ఎఫ్ 3లో ఆ పాట...

అనిల్ రావిపూడితో త‌మ‌న్నాకు గొడ‌వ … ఎఫ్ 3లో ఆ పాట ఆగిపోయిన‌ట్టే…!

టాలీవుడ్‌లో ఇన్న‌ర్ గాసిప్‌లు చాలానే ఉంటాయి. అందులో అక్క‌డ ఉన్న యూనిట్ వారు బ‌య‌ట‌కు లీక్ చేస్తే లీక్ అవుతుంటాయి. లేక‌పోతే అవి అలాగే మ‌రుగున ప‌డిపోతాయి. కాస్త ఆల‌స్యంగా ఓ ఇంట్ర‌స్టింగ్ టాపిక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మిల్కిబ్యూటీ త‌మ‌న్నాకు.. ఎఫ్ 3 డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి మ‌ధ్య చిన్నపాటి వాగ్వివాదం ప్రారంభం కావ‌డం.. చివ‌ర‌కు ఈ ఇష్యూలోకి దిల్ రాజు టీం ఎంట‌ర్ అయ్యాక‌…. అది మ‌రింత పెద్ద‌ది కావ‌డం జ‌రిగిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న గుస‌గుస‌లు..!

ఎఫ్ 2 సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌. ఆమెను వెంకీకి జోడీగా సెట్ చేశాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. వెంకీ – త‌మ‌న్నా మ‌ధ్య వ‌చ్చిన సీన్లు ఎలా కామెడీ పండించాయో చూశాం. ఈ క్ర‌మంలోనే ఎఫ్ 2 హీరోల‌తో పాటు హీరోయిన్ల‌ను కూడా ఎఫ్ 3లో కంటిన్యూ చేసుకొచ్చాడు అనిల్‌. సినిమా బాగానే వ‌చ్చింద‌ని అంటున్నారు. ఇక మిల్కీబ్యూటీ త‌మ‌న్నా విష‌యంలో ఇండ‌స్ట్రీలో ఓ కంప్లైంట్ అయితే ఉంది. ఆమె డేట్లు ఇచ్చే విష‌యంలోనూ, షూటింగ్‌కు వ‌చ్చే విష‌యంలో క్లారిటీతో ఉండ‌ద‌ని అంటారు.

ఆమె న‌టించే సినిమా ఆమె వ‌ల్లే డిలే అవుతూ ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు అయితే ఉన్నాయి. ఎఫ్ 3 విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ట‌. దీంతో ఈ చిన్న ఇష్యూ పెద్ద‌దిగా మారి ముందు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌మ‌న్నాపై అస‌హ‌నం వ్య‌క్తం చేసే వ‌ర‌కు వ‌చ్చింది. హీరోయిన్ స‌రిగా షూటింగ్‌కు రాక‌పోతే ద‌ర్శ‌కుడికే కాదు అటు నిర్మాత‌కు బ‌ర్డెన్ మామూలుగా ఉండ‌దు. ఖ‌ర్చు పెరుగుతుంది. ఆ సీన్ల‌లో షూటింగ్‌కు రావాల్సిన వారి కాల్షీట్లు మ‌ళ్లీ తీసుకోవాలి.. ఇలా చాలా త‌తంగాలే ఉంటాయి.

అయితే అప్ప‌టికే సినిమా అంతా దాదాపు పూర్త‌యిపోయింది. అయితే టోట‌ల్ టీమ్‌తో ఓ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ప్లాన్ చేశార‌ట‌. అది అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన స్పెష‌ల్ సెట్లో ప్లాన్ చేశారు. త‌మ‌న్నా ఈ సాంగ్‌కు వ‌స్తుందో ? లేదో ? అన్న డౌట్లు ఉన్నాయి. ఈ గొడ‌వలో రాజీ ప‌డి త‌మ‌న్నా వ‌స్తే ప్ర‌మోష‌న్లు ప్ర‌శాంతంగా ఉంటాయి. ఆమె రాక‌పోతే ఈ గొడ‌వ‌కు ఇంకా ఫుల్ స్టాప్ ప‌డ‌న‌ట్టే అవుతుంది.

మ‌రోవైపు రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ప‌క్క‌న పెట్టేసి… మ‌రో స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక ఈ నెల 29న మెగాస్టార్ ఆచార్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు రెండు రోజుల ముందు 27న ఎఫ్ 3 వ‌స్తోంది. అటు మెగాస్టార్ సినిమా ఉన్నా దిల్ రాజు ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఎఫ్ 3 వేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news