Moviesబాల‌య్య ప్ర‌తాప‌రుద్రుడు సినిమా ఎందుకు ఆగిపోయింది.. ఏం జ‌రిగింది...!

బాల‌య్య ప్ర‌తాప‌రుద్రుడు సినిమా ఎందుకు ఆగిపోయింది.. ఏం జ‌రిగింది…!

జై బాలయ్య జై జై బాలయ్య.. అంటూ బాలయ్య అభిమానులందరు బాలకృష్ణ కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు. బాలయ్య బాబు కూడా అదే స్థాయిలో అయన ఫ్యాన్స్ అందరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అయితే బాలకృష్ణ మొదటి సారి తాతమ్మ కల అనే సినిమా ద్వారా నందమూరి తారక రామారావు తనయుడుగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు..ఆ సినిమాని బాలకృష్ణ తండ్రి రామారావు గారే స్వయంగా డైరెక్ట్ చేసారు. బాలయ్యకి దగ్గరుండి నటనలో ఓనమాలు దిద్దించారు. అందుకేనేమో బాలయ్య బాబు గారి నటన చూస్తూ మురిసిపోని తెలుగువాడు ఉండడు. ఇప్పటివరకు బాలకృష్ణ మొత్తం 107 సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో పోషించి మనల్ని అలరించారు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు.

అయితే బాలకృష్ణ తన కెరియర్లో కొన్ని సినిమాలు మొదలుపెట్టి మధ్యలో ఆపేసినవి ఉన్నాయి. అందులో ఒకటి ప్రతాపరుద్రుడు సినిమా. ఈ సినిమా కానీ ఒకవేళ పూర్తయి థియేటర్లో రిలీజ్ అయి ఉంటే బాలకృష్ణ కెరియర్ ఇంకోలా ఉండేది అని చెప్పొచ్చు. మామూలుగా ఒక సినిమా మొదలయ్యి ఆగిపోయింది అంటే బడ్జెట్ ప్రాబ్లెమ్ లేదంటే హీరో, హీరోయిన్ డేట్స్ సేట్ అవ్వకపోవడం..సరిగ్గా మార్కెటింగ్ చేయకపోవడం లాంటి కారణాలు ఉండొచ్చు కానీ ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది తెలుసా… దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం..

బాలకృష్ణ కెరియర్ బాగా ఫామ్ లో ఉన్నప్పుడు అంటే మూడు బ్లాక్ బస్టర్ లు ఆరు సూపర్ హిట్ లు అన్నట్టుగా ఉన్న సమయంలో ఒక మంచి పౌరాణిక కథాంశంతో మొదలైన బాలకృష్ణ సినిమా ప్రతాపరుద్రుడు. ఈ సినిమాని ప్రతాప సింహ అని కూడా పిలిచేవారు. అయితే ఈ సినిమాకి దర్శకుడుగా కోడి రామకృష్ణ, ప్రొడ్యూసర్ గా అప్పట్లో సూపర్ హిట్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్.గోపాల్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. అయితే కోడి రామకృష్ణ, బాలకృష్ణ అండ్ ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి వీళ్ల ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన మంగమ్మగారి గారి మనవడు సినిమా అప్పటికే సూపర్ డూపర్ హిట్ అవడంతో.. మళ్లీ వీళ్ల ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ప్రతాపరుద్రుడు సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఆ రోజుల్లో నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల కారణంగా విక్రమ సింహ భూపతి అనే టైటిల్ తో బాలకృష్ణను పెట్టి పోస్టర్స్ కూడా రెడీ చేసారు. అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు. ఇంకా ఈ సినిమాలో అలనాటి నటి భానుమతి కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఈమె మనవడిగా బాలకృష్ణ అద్భుతమైన నటన కనబరిచారు. అలా సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది అంటే ఆల్మోస్ట్ 60 శాతం షూటింగ్ ని హైదరాబాదులోని చుట్టుపక్కల ప్రాంతాల్లో త్వరగానే కంప్లీట్ చేశారు.

అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు. అందులో షూటింగ్ యధావిధిగా జరుగుతోంది. అప్పుడే హఠాత్తుగా ఒక వార్త ఈ సినిమాని నిర్మిస్తున్న గోపాల్ రెడ్డి ఆరోగ్యం బాగోలేక హాస్పటల్లో జాయిన్ అయ్యారు అన్న వార్త… ఈ వార్తతో షూటింగ్ కి బ్రేక్ పడింది. మంగమ్మగారి మనవడు, ముద్దుల మేనల్లుడు, మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య.. లాంటి సూపర్ హిట్ సినిమాలకి నిర్మాత్తగా వ్యవహరించిన గోపాల్ రెడ్డి గారు సడన్ గా హాస్పటల్లో జాయిన్ అవ్వడం వల్ల‌ ఈ సినిమా బాధ్యతలను తన కొడుకు భార్గవ్ కి అప్పగించారు. ఆ సినిమాతోనే ఆయన వారసుడు భార్గవ్ ప్రొడ్యూసర్ గా పరిచయం కూడా అయ్యారు. కానీ ఆ తర్వాత గోపాల్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో…ఆయన మరణించారు.

సినిమాకి ఆయుపట్టు అయిన ప్రొడ్యూసర్ చనిపోవడంతో సినిమా కొన్నాళ్ళు ఆగిపోయింది. ఇక ఆయన కొడుకు భార్గవ్ కొన్నాళ్ళకు… డైరెక్టర్ కోడి రామకృష్ణను అలాగే హీరో బాలకృష్ణను కలిసి మా నాన్నగారి చేతుల మీదగా మొదలైన ఈ సినిమా ఆయన లేకుండా పూర్తిచేయడం నాకిష్టం లేదని చెప్పగా సరే అని భార్గవ్ గారి సెంటిమెంట్ కాదనలేక వాళ్ళు ఒప్పుకున్నారు. అలా ప్రతాపరుద్రుడు సినిమా ఆగిపోయింది. ఒక మంచి పౌరాణిక కథతో మొదలైన ఈ సినిమా పూర్తయి థియేటర్లో రిలీజ్ అయి ఉంటే… బాలయ్య బాబు సినీ ప్రస్థానంలో ఈ సినిమా కూడా ఒక చరిత్రగా నిలిచిపోయేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news