Moviesచ‌ర‌ణ్‌, రాజ‌మౌళిని ప‌క్క‌న పెట్టేసి డామినేష‌న్ అంతా ఎన్టీఆర్‌దే..!

చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిని ప‌క్క‌న పెట్టేసి డామినేష‌న్ అంతా ఎన్టీఆర్‌దే..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన సినిమా త్రిబుల్ ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత తెర‌కెక్కించిన ఈ సినిమా రు. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని మూడేళ్లుగా ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ ఎదురు చూస్తున్నారు.

డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య ఈ సినిమాను రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ హీరోలు కావ‌డంతో ఎన్టీఆర్‌, చెర్రీ ఫ్యాన్స్ అప్పుడే హంగామా స్టార్ట్ చేసేశారు. ఎక్క‌డిక‌క్క‌డ టిక్కెట్లు, థియేట‌ర్లు బుక్ చేసేస్తున్నారు. ఈ ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా సినిమాలో త‌మ హీరో పాత్రే హైలెట్ అవుతుంద‌ని గొప్ప‌లు స్టార్ట్ చేశారు. సోష‌ల్ మీడియా అయితే ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల హంగామా ట్రెండింగ్ న‌డుస్తోంది.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్లు సౌత్ టు నార్త్ వ‌ర‌కు భారీ ఎత్తున న‌డుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, జ‌క్క‌న్న ముగ్గురూ క‌లిసి ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. నైట్ మూమెంట్‌లో ఈ ఇంట‌ర్వ్యూ చ‌క్క‌గా ప్లాన్ చేశారు. అనీల్ రావిపూడి చాలా స‌ర‌దాగా ప్ర‌శ్న‌లు వేసి.. ఇంట‌ర్వ్యూను ఫుల్ జోష్‌లో న‌డిపించారు. అటు చ‌ర‌ణ్‌, తార‌క్‌, జ‌క్క‌న్న కూడా అంతే స‌ర‌దాగా ఆన్స‌ర్లు చెప్పి చాలా స‌ర‌దాగా ఇంట‌ర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు.

ఇదిలా ఉంటే త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్ల‌లో ఎన్టీఆర్ డామినేష‌న్ చాలా క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోందన్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్నాయి. ప‌లు ఇంట‌ర్వ్యూల్లో ఎక్కువుగా ఎన్టీఆరే లీడ్ తీసుకుని ఆన్స‌ర్లు చెపుతోన్న ప‌రిస్థితి ఉంది. ఇక అనిల్ రావిపూడి ఇంట‌ర్వ్యూలో సైతం జ‌క్క‌న్న‌, చ‌ర‌ణ్‌ల‌ను ఎన్టీఆర్ పూర్తిగా డామినేట్ చేశారు. అనిల్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు కావ‌చ్చు.. ఇటు సినిమా విశేషాల‌ను అన్ని కూడా గ‌డ‌గ‌డా చెపుతూనే ఉన్నాడు.

ఇక జ‌క్క‌న్న సినిమా షూటింగ్‌లో తాము ఏదైనా రిక్వెస్ట్ చేసిన‌ప్పుడు ఫేస్ ఎలా పెడ‌తాడో ? త‌మ‌కు ఎంత ఇరిటేష‌న్ తెప్పిస్తాడో ? కూడా చెప్పి జ‌క్క‌న్న‌ను కూడా ఆడుకున్నాడు. ఏదేమైనా త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్ల‌లో తార‌క్ డామినేష‌న్ అయితే స్ప‌ష్టంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news