Moviesఎన్టీఆర్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది.. తార‌క్ చంపేశావ్ పో...!

ఎన్టీఆర్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది.. తార‌క్ చంపేశావ్ పో…!

RRR ప్ర‌మోష‌న్లు అదిరిపోతున్నాయి. ఎక్క‌డ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. దేశ‌వ్యాప్తంగా సౌత్ టు నార్త్ వ‌ర‌కు ఏ రాష్ట్రంలో చూసినా.. ఏ లాంగ్వేజ్‌లో చూసినా త్రిబుల్ ఆర్ ట్రెండింగ్ అయితే మామూలుగా లేదు. తాజాగా క‌ర్నాక‌ట‌లో జ‌రిగిన ఈ సినిమా ఈవెంట్ గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ క్లాసీ అండ్ మాసీ లుక్‌లో క‌నిపించి ఒక్కసారిగా అంద‌రి దృష్టిని త‌న వైపున‌కు ట‌ర్న్ చేసుకున్నాడు.

త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కాస్త స్లిమ్ లుక్‌లో క‌నిపించాడు. అయితే ఇప్పుడు గుబురు గ‌డ్డంతో కొద్దిగా చ‌బ్బీగా ఉన్నాడు. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట్లో చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా మేకోవ‌ర్ కోసం రెడీ అవుతున్నార‌ని.. అందుకే ఈ క్లాసీ + మాసీ క‌ల‌బోత లుక్‌లోకి మారిపోయాడ‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు.

2017లో వీరి కాంబోలో జ‌న‌తా గ్యారేజ్ సినిమా వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర్వాత వీరి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది. ఈ రివేంజ్ డ్రామాకు సంబంధించి ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఏప్రిల్ నెల‌లో ఈ ప్రాజెక్టును సెట్స్ మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నారు. ఇక కొర‌టాల సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్ ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశారు. స్పోర్ట్స్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

పెద్ది అనే టైటిల్ కూడా ఈ సినిమాకు ప్ర‌చారంలో ఉంది. ఈ సినిమాలో తారక్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కొర‌టాల ప్రాజెక్టుతో పాటు బుచ్చిబాబు ప్రాజెక్టును కూడా ప్యార‌ల‌ల్‌గా చేస్తార‌ని టాక్ ? మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తాజా లుక్ కొర‌టాల సినిమాకా, బుచ్చిబాబు సినిమాకా అన్న‌ది తెలియ‌దు కాని.. ఈ లుక్ వేరియేష‌న్ మాత్రం చాలా బాగుంది.

ఈ యేడాది త్రిబుల్ ఆర్‌తో పాటు ద‌స‌రాకు కొర‌టాల శివ సినిమా రిలీజ్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కాస్త ఆక‌లి తీరుతోంది. మ‌రి ఎన్టీఆర్ ఏం చేస్తాడో ? ఎంత స్పీడ్‌గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news