Moviesస‌మంత చివ‌ర‌కు ఇంత లైట్ అయిపోయిందా... !

స‌మంత చివ‌ర‌కు ఇంత లైట్ అయిపోయిందా… !

నాలుగైదు నెల‌ల క్రితం వ‌ర‌కు సమంత టాలీవుడ్‌లో ఓ బ్రాండ్‌. టాలీవుడ్ దిగ్గ‌జ ఫ్యామిలీ అక్కినేని ఇంటి కోడలు. అయితే ఇప్పుడు ఈ బంధం తెగిపోయింది. అక్కినేని కుటుంబానికి, స‌మంత‌కు ఎలాంటి సంబంధం లేదు. ఎవ‌రి దారులు వారివే. చైతుతో విడాకులు ఇచ్చేశాక ఎవ‌రికి వారు ఫ్రీ బ‌ర్డ్స్ అయిపోయారు. చైతు త‌న సినిమాల్లో తాను బిజీగా ఉన్నాడు. ఇటు స‌మంత కూడా వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటోంది. టాలీవుడ్‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం సినిమా చేసిన స‌మంత‌.. ఇప్పుడు య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమాకు కూడా సైన్ చేసింది.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే బాలీవుడ్‌లో హాట్ వెబ్ సీరిస్‌లు చేయ‌డంతో పాటు హాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పింది. ఈ హాలీవుడ్ సినిమాలో స‌మంత పూర్తి హాట్‌గా క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. కోలీవుడ్‌లో కార్తీ హీరోగా మ‌రో సినిమాలో కూడా ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ వ‌చ్చింది. ఇక ప‌లు కార్పోరేట్ యాడ్స్ చేసేందుకు కూడా చ‌క‌చ‌కా సైన్ చేసింది. ఇటు త‌న సొంత వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది.

ప్ర‌స్తుతానికి స‌మంత జోష్‌లో ఉన్న‌ట్టే క‌నిపిస్తున్నా.. అదంతా పైన ప‌టారం.. లోన లొటారం అన్న‌ట్టుగానే ఉంది. ఆమెకు ఇక టాలీవుడ్‌లో ఛాన్సులు లేన‌ట్టే క‌నిపిస్తోంది. ఏదో హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ కూడా ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కులు మాత్ర‌మే ఆమెకు ఛాన్సులు ఇస్తే ఇవ్వొచ్చు గాని.. స్టార్ హీరోలు, యంగ్ హీరోల‌తో పాటు క‌మర్షియ‌ల్ సినిమాల్లో ఆమెకు ఎవ్వ‌రూ ఛాన్సులు ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేదు.

అస‌లు స‌మంత‌కు సోష‌ల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉండేది. విడాకుల త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ఇది త‌గ్గుతూ వ‌స్తోంది. చాలా లోతుగా ప‌రిశీలించిన వాళ్ల‌కే ఇది తెలుస్తోంది. కోలీవుడ్‌లో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తితో పాటు స‌మంత న‌టించిన ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా టైటిల్‌ ఫైనల్ చేశారు. ఖ‌తీజా పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది.

ఇది నెగిటివ్ రోల్‌.. స‌మంత చాలా బాగా న‌టించింద‌ని కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ మూవీ ట్రైల‌ర్ తెలుగులో రిలీజ్ అయ్యింది. దీనిని ఇక్క‌డ ప‌ట్టించుకున్నోళ్లు లేరు. అస‌లు తెలుగు జ‌నాల‌కు ఈ మూవీ ట్రైల‌ర్ వ‌చ్చింద‌న్న విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు. అసలు ఈ సినిమా గురించి తెలుగు జ‌నాల్లో టాక్ లేదు.. అస‌లు ప‌ట్టించుకునే వాళ్లే లేరు. రేపు శాకుంత‌లం రిలీజ్ అయినా కూడా స‌మంత సినిమాను ప‌ట్టించుకునే వాళ్లే లేక‌పోవ‌చ్చంటున్నారు. ఓవ‌రాల్‌గా చూస్తే స‌మంత‌ను టాలీవుడ్ మెల్ల‌మెల్ల‌గా లైట్ తీస్కొంటోన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news