Moviesస్టార్ క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా - మాధురీ దీక్షిత్ బ్రేక‌ప్ స్టోరీ......

స్టార్ క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా – మాధురీ దీక్షిత్ బ్రేక‌ప్ స్టోరీ… సినిమాను మించిన ప్రేమ‌క‌థ‌..!

అజ‌య్ జ‌డేజా 1990వ ద‌శ‌కంలో భార‌త స్టార్ క్రికెట‌ర్‌. జ‌డేజా నిజానికి గొప్ప డేరింగ్ & డాషింగ్ ఆట‌గాడే. అయితే అంత‌కు మించి మైదానంలో త‌న స్టైలీష్ ప్ర‌వ‌ర్త‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎక్కువుగా ఆక‌ట్టుకునే వాడు. రౌండ్ క్యాప్‌, స్పెట్స్, స్టైలీష్ బ్యాటింగ్ ఇవ‌న్నీ జ‌డేజా సొంతం. జ‌డేజా అంటే అంద‌రికి 1996 ప్ర‌పంచక‌ప్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పాకిస్తాన్‌పై ఆడిన చిర‌స్మ‌ర‌ణీయ ఇన్సింగ్స్ గుర్తుకు వ‌స్తుంది.

ఆ మ్యాచ్‌లో చెల‌రేగి కేవ‌లం 25 బందుల్లోనే 45 ప‌రుగులు చేసి భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. జ‌డేజా డేరింగ్ & డాషింగ్ బ్యాటింగ్ అన్నా… స్టైలీష్ లైఫ్ అన్నా అప్ప‌ట్లో చాలా మంది అమ్మాయిలు ప‌డి చ‌చ్చేవారు. అప్ప‌ట్లో జ‌డేజా భార‌త్‌లో ఎంతో మంది అమ్మాయిల క‌ల‌ల యువ‌రాజు. అలాంటి జ‌డేజా అప్ప‌ట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఉన్న మాధురీ దీక్షిత్‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు వెళుతుంది అనుకుంటోన్న టైంలో వీరి ప్రేమ‌కు స‌డెన్‌గా బ్రేక‌ప్ ప‌డింది.

అది 1990ల నాటి క‌థ‌. ఓ మ్యాగ‌జైన్ ఫొటో షూట్ కోసం జ‌డేజా వెళ్లాడు. అక్క‌డే జ‌డేజాకు మాధురి క‌లిసింది. అప్ప‌టికే ఆమె సినిమాలు చాలా చూశాడు. అయితే ఆమెను క‌ల‌వ‌డం అదే మొద‌టిసారి. ఆమెకు ఆరాధ‌కుడు అయిపోయాడు. బాలీవుడ్ వెండితెర కుంద‌నాల బొమ్మ త‌న క‌ళ్ల ముందు క‌న‌ప‌డే స‌రికి అలా ప‌డిపోయాడు. ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. ఆమె అందానికి ముగ్ధుడై.. ఆమె న‌వ్వుకు ప‌డిపోయాడు.

అజ‌య్ జ‌డేజా గురించి మాధురీ కూడా వింది.. కానీ క‌ల‌వ‌డం అదే మొద‌టిసారి.. ఆమె కూడా ఎగ్జ‌యిట్ అయ్యింది. స్నేహం చేసింది.. అప్ప‌టికే సంజ‌య్‌ద‌త్‌తో ప్రేమ‌లో ఉంది. అత‌ను టాడా కేసులో ఇరుక్కోవ‌డం.. ఇటు మీడియా కూడా మాధురీని ఫోక‌స్ చేయ‌డంతో ఆమె కూడా చికాకుల్లో ఉంది. ఈ గోలంతా త‌న‌కు ఎందుకు ? అనుకుని జ‌డేజాతో ప్రేమ‌లో ప‌డింది. అలా అన‌డం కంటే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు.

మాధురీకి త‌న మీదున్న ప్రేమ‌తో సినిమా రంగంలో త‌న ఎంట్రీకి వాడుకోవాల‌ని అనుకున్నాడు అజ‌య్‌. తాను కూడా మైదానంలో సిక్స‌ర్లు కొట్టిన‌ట్టు వెండితెర‌పై ఫైట్లు చేసి ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయించుకోవాల‌ని అనుకున్నాడు. మాధురి కూడా అజ‌య్‌కు వెన్నుద‌న్నుగా నిల‌వాల‌ని అనుకుంది. త‌న‌కు తెలిసి నిర్మాత‌ల ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్లి రిక‌మెండ్ చేసింది. ఆ టైంలో ఇద్ద‌రి మ‌ధ్య చ‌నువుతో వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌న్న పుకార్లు బాలీవుడ్‌లో వ‌దంతులు వినిపించాయి.

ఈ లోపే భార‌త క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ముస‌లం మొద‌లైంది. అందులో అజ‌య్ పేరు వినిపించింది. దీంతో మ‌రోసారి మాధురి మీడియాలోకి త‌న ప్ర‌మేయం లేకుండానే ఎక్కాల్సి వ‌చ్చింది. ఇవేవీ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అజ‌య్ మాధురీనీ వారించాడు. ఈ లోగా అజ‌య్ వాళ్లింట్లో ఈ ఇద్ద‌రి ప్రేమా తెలిసింది. అజ‌య్ వాళ్ల‌ది హ‌ర్యానాలోని రాజ‌కుటుంబం.. ఛ ఓ సినిమా యాక్ట‌ర్ మ‌న ఇంటికి కోడ‌లిగా రావ‌డ‌మా ? అని వాళ్లు ఫైర్ అయ్యారు.

ఇన్ని గొడ‌వ‌ల మ‌ధ్య‌లో అజ‌య్ ఫిక్సింగ్‌లో దోషిగా తేలాడు. దీంతో ఈ రిలేష‌న్‌ను మ‌రింత ముందుకు తీసుకు వెళ్లాల‌ని మాధురీ అనుకోలేదు. అయితే మాధురీ కుటుంబం మాత్రం అజ‌య్ ప‌ట్ల సానుకూల‌త‌తోనే ఉంది. అత‌డిని త‌మ ఇంటి అల్లుడిని చేసుకోవాల‌నే ఆరాట‌ప‌డ్డారు. అయితే అజ‌య్ వాళ్లింట్లో మాధురీని కోడ‌లిగా చేసుకునేదే లేద‌న్న చ‌ర్చ జ‌ర‌గ‌డంతో అది తెలిసిన మాధురీ కుటుంబం అప్పుడు అజ‌య్‌ను అల్లుడి చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.

మాధురీ మ‌ళ్లీ ఎక్క‌డ దిగాలు ప‌డుతుందో అని మాధురి కుటుంబం వెంట‌నే అమెరికా సంబంధం తెచ్చేశారు. అత‌డే డాక్ట‌ర్ శ్రీరామ్‌. అత‌డిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయి అక్క‌డ సెటిల్ అయిపోయింది. ఇక అజ‌య్ జ‌డేజా కూడా జ‌యా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జ‌డేజా అత్త‌గారు అప్ప‌ట్లో స‌మ‌తాపార్టీలో కీలకంగా ఉండేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news