Moviesక‌ళ్లు చెదిరే RRR ఇంట‌ర్వెల్‌... 22 నిమిషాలు 60 రాత్రులు..!

క‌ళ్లు చెదిరే RRR ఇంట‌ర్వెల్‌… 22 నిమిషాలు 60 రాత్రులు..!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది ఉత్కంఠ మామూలుగా లేదు. ఒక‌టి కాదు రెండు కాదు మూడేళ్ల నుంచి కూడా టాలీవుడ్ మాత్ర‌మే కాదు యావ‌త్ భార‌త‌దేశం అంతా ఈ సినిమా కోసం ఓ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారు అంటే త్రిబుల్ ఆర్ రేంజ్ ఏంటో తెలుస్తోంది. రు. 500 కోట్ల బ‌డ్జెట్ కావ‌డం ఒక ఎత్తు అయితే… ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి ఇద్ద‌రు చారిత్ర‌క యోధుల పాత్ర‌ల్లో న‌టించ‌డం మ‌రో ఎత్తు.

అస‌లు రాజ‌మౌళి సినిమా అంటేనే సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ.. ఏ హీరో అభిమాని అయినా ఎగ్జైట్మెంట్‌తో ఉంటాడు. అందులోనూ మెగా – నంద‌మూరి కాంపౌండ్‌లోనే స్టార్ హీరోలుగా ఉన్న చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఇక మామూలు ఉత్కంఠ లేదు. ఇక ఈ సినిమాలో ఒక్కో సీన్ గురించి వింటుంటేనే గూస్‌బంప్స్ వ‌చ్చేస్తున్నాయి. ఈ సీన్ల‌ను థియేట‌ర్ల‌లో చూస్తుంటే ఇంకే రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో ? ప్రేక్ష‌కుల గోల ఎలా ఉంటుందో ? ఊహ‌కే అంద‌డం లేదు.

ఇక ఈ సినిమా ఇంట‌ర్వెల్ గురించి సినిమా ప్ర‌మోష‌న్ల‌లో రాజ‌మౌళి – చ‌ర‌ణ్ – తార‌క్ చెప్పారు. ఇంటర్వెల్‌తో పాటు క్లైమాక్స్ కూడా ఊహ‌కు అంద‌కుండా ఉంటుంద‌ట‌. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ చూస్తుంటేనే మ‌తులు పోతాయ‌ని అంటున్నారు. ఈ ఇంట‌ర్వెల్ సీన్ కోసం ఏకంగా 60 నిద్ర‌లేని రాత్రులు గ‌డిపార‌ట చ‌ర‌ణ్‌, తార‌క్‌. దీనిని బ‌ట్టే ఈ బ్యాంగ్ చూస్తే ఎలా మ‌తులు పోతాయో తెలుస్తోంది.

ఇక 22 నిమిషాల పాటు ఉండే ఈ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ చూస్తుంటే థియేట‌ర్ల‌లో ప్ర‌తి ఒక్క‌రి రొమాలు నిక్క‌పొడుచుకోవ‌డంతో పాటు అరాచ‌కం అంటే ఏంటో బాహుబ‌లి త‌ర్వాత మ‌రోసారి రాజ‌మౌళి చూపిస్తాడ‌ని కూడా అంటున్నారు. సినిమాకు ఇది హార్ట్ అవ్వ‌డం వ‌ల్లే దీని కోసం తాము ఏకంగా 60 రాత్రుల పాటు క‌ష్ట‌ప‌డ్డాం అని తార‌క్‌, చ‌ర‌ణ్ చెపుతున్నారు. మ‌రి వీరు అంత‌గా చెప్పారంటేనే ఈ బ్యాంగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌డానికి ఊహ‌కే అంద‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news