Moviesబాల‌య్య మొద‌టి సినిమా తాత‌మ్మ క‌ల బ్యాన్ చేయ‌డానికి కార‌ణాలు ఇవే...!

బాల‌య్య మొద‌టి సినిమా తాత‌మ్మ క‌ల బ్యాన్ చేయ‌డానికి కార‌ణాలు ఇవే…!

యువ‌రత్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల్లోకి వ‌చ్చి దాదాపు నాలుగు ద‌శాబ్దాలు అవుతోంది. ఓ హీరో నాలుగు ద‌శాబ్దాల పాటు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగడం అంటే మామూలు విష‌యం కాదు. బాల‌య్య త‌న తండ్రి ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాత‌మ్మ క‌ల సినిమాతో వెండితెరం గ్రేటం చేశారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమాలో పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. 1974 ఆగ‌స్టు 30న థియేట‌ర్లోకి వ‌చ్చింది. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. అయితే బాల‌య్య‌కు న‌టుడిగా మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా వ‌చ్చిన‌ప్పుడు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఇది కుటుంబ నియంత్ర‌ణ పాల‌సీకి వ్య‌తిరేకంగా తెర‌కెక్కింద‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో బాగా జ‌రిగింది. నాలుగు త‌రాల క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో తాత‌మ్మ పాత్ర‌లో భానుమ‌తి న‌టించారు. బాల‌య్య చిన్న‌ప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఈ సినిమాయే బీజం వేసింది. ఈ సినిమాలో కుటుంబ నియంత్ర‌ణ‌తో పాటు భూసంస్క‌ర‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా కొన్ని డైలాగులు ఉండ‌డంతో వాటిపై ప్ర‌భుత్వం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

50 రోజుల పాటు ఈ సినిమాపై బ్యాన్ విధించారు. అప్పట్లో దీనిపై పెత్త ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రిగింది. అప్పుడు దీనిపై సీనియ‌ర్ ఎన్టీఆర్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. పెద్ద ఎత్తున పోరాటం త‌ర్వాత 50 రోజుల ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత మార్పుల‌తో చేసిన సినిమాను ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమాను సెకండ్ రిలీజ్ చేసిన‌ప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి క‌ల‌ర్‌లోకి మార్చారు.

ఎన్నో వివిదాల‌కు కార‌ణ‌మైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌క్సెస్ కాలేదు. అయితే రెండు సార్లు రిలీజ్ అయిన రికార్డు ఈ సినిమాకు ద‌క్కింది. ఈ సినిమా షూటింగ్ టైంలో ఒక్కోసారి సీనియ‌ర్ ఎన్టీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో బాల‌య్య టెన్ష‌న్ ప‌డ్డార‌ని స‌మాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news