Moviesబాల‌య్య సినిమాలో శ్రీలీల‌... ప‌వ‌న్ హీరోయిన్ కూడా... కేక పెట్టించే కాంబినేష‌న్‌...!

బాల‌య్య సినిమాలో శ్రీలీల‌… ప‌వ‌న్ హీరోయిన్ కూడా… కేక పెట్టించే కాంబినేష‌న్‌…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ స‌క్సెస్ త‌ర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు ఓకే చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టిస్తోన్న సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి, ప‌ర‌శురాం లాంటి డైరెక్ట‌ర్ల సినిమాల్లో కూడా బాల‌య్య న‌టించ‌నున్నాడు.

ఈ క్ర‌మంలోనే అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టించే సినిమా కోసం హీరోయిన్లు, ఇత‌ర కాస్టింగ్ వేట మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం డైరెక్ట్ చేస్తోన్న ఎఫ్ 3 సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింది. ఆ వెంట‌నే అనిల్ బాల‌య్య‌తో సినిమా కోసం వ‌ర్క్ స్టార్ట్ చేసేస్తాడు.

ఈ సినిమా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ట‌చ్చింగ్‌తో పాటు యాక్ష‌న్ కూడా ఎక్కువే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఓ పాత్ర కోసం కుర్ర‌కారును ఊపేస్తోన్న యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు వినిపిస్తోంది. శ్రీలీల‌కు ఇటీవ‌ల క్రేజ్ బాగా పెరిగిపోవ‌డంతో రేటు పెంచేసింది. ఆమె ఒక్కో సినిమాకు రు.70 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తోంద‌ని అంటున్నారు. ఇక బాల‌య్య సినిమా అంటే ఈ రెమ్యున‌రేష‌న్ మ‌రింత ఎక్కువే ఉంటుంది.

శ్రీలీల న‌ట‌సింహం బాల‌య్య కుమార్తెగా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇక ఇద్ద‌రు హీరోయిన్లు బాల‌య్య ప‌క్క‌న న‌టిస్తారు. వీరిలో ఒక హీరోయిన్‌గా ప‌వ‌న్ క‌ళ్యాన్ ప‌క్క‌న గుడుంబా శంక‌ర్ సినిమాలో న‌టించిన వెట‌ర‌న్ హీరోయిన్ మీరా జాస్మిన్ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మీరా జాస్మిన్ ఇటీవల మేకోవ‌ర్‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు బాల‌య్య సినిమాలో అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news