Movies#NBK107 ఆ హిట్ సినిమాకు రీమేకా... అయితే ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌ర్‌..!

#NBK107 ఆ హిట్ సినిమాకు రీమేకా… అయితే ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌ర్‌..!

అఖండ సినిమాతో టోట‌ల్ టాలీవుడ్‌ను అఖండ మానియాతో ముంచేశాడు న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. బోయ‌పాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో… బాల‌య్య కెరీర్‌లోనే ఎన్ని రికార్డులు న‌మోదు చేసిందో చూస్తూనే ఉన్నాం. తాజాగా 80 రోజుల‌కు చేరువ అయిన అఖండ ఇంకా కొన్ని చోట్ల ర‌న్ అవుత‌నూ ఉంది. బాల‌య్య కెరీర్‌లోనే తొలి రు. 200 కోట్ల సినిమాగా అఖండ రికార్డుల‌కు ఎక్కింది. ఓవ‌రాల్‌గా 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

అఖండ‌, అన్‌స్టాప‌బుల్ షోలు బ్లాక్‌బ‌స్ట‌ర అవ్వ‌డంతో జోష్‌లో ఉన్న బాల‌య్య ఇప్పుడు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేష‌న్ ప‌ట్ల ఇప్పుడు భారీ అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ‌లోని సిరిసిల్ల‌లో ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సినిమా షూటింగ్ స్టార్టింగ్‌లోనే రామ్ – ల‌క్ష్మ‌న్ నేతృత్వంలో బాల‌య్య‌పై అదిరిపోయే యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించారు.

బాల‌య్య లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చాలా ఊర‌మాస్ లుక్‌తో పాటు ర‌ఫ్ గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో బాల‌య్య గెట‌ప్‌, షూటింగ్ సెట‌ప్ చూస్తుంటే ఇది క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మ‌ఫ్టీకి రీమేక్‌గా తెర‌కెక్కుతోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాల‌య్య‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన క‌న్న‌డ హీరో శివ‌రాజ్‌కుమార్ హీరోగా తెర‌కెక్కిన మ‌ఫ్టీ సూప‌ర్ హిట్ అయ్యింది.

శివ‌రాజ్‌కుమార్ , బాల‌య్య మంచి స్నేహితులు. బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో చిన్న రోల్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ శివ‌రాజ్ చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మ‌ప్టీ రీమేక్‌లోనే బాలయ్య న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా క‌న్న‌డ‌లో యాక్ష‌న్ సీన్ల‌తో తెర‌కెక్కి మాసీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా తెర‌కెక్కింది. ఇదే సినిమాను ఇక్క‌డ మాస్‌కు, బాల‌య్య ఫ్యాన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెర‌కెక్కిస్తే బాల‌య్య ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డిన‌ట్టే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news