Moviesనాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు..సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జ‌బ‌ర్ద‌స్త్...

నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు..సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జ‌బ‌ర్ద‌స్త్ కమెడీయన్..?

సుడిగాలి సుధీర్..వామ్మో ఈ పేరుకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా.. ఓ స్టార్ హీరోకి కూడా లేరంటే నమ్మడి. అంత క్రేజ్ ఉంది జనాలో సుధీర్ కు. జ‌బ‌ర్ద‌స్త్ అనే కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్ధస్త్ షో ఎంతో మంది క‌మెడియ‌న్ల‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. వీరంద‌రిలోకి జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అవ్వడంతో పాటు ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది మాత్రం సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి. ఈ షోతో వ‌చ్చిన పాపులారిటీతోనే సుధీర్ సినిమా హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.

సుడిగాలి సుధీర్ – ర‌ష్మీ జంట బుల్లితెర మీద క‌నిపిస్తే తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ఎంత‌లా మెస్మ‌రేజ్ అవుతారో తెలిసిందే.జబర్దస్త్ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ ఉన్నాడు అంటే ఆ ఎపిసోడ్ ఎంతలా పేలిపోతుందో దానికి రేటింగ్ లు ఎలా వస్తాయో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సుధీర్‌కు రష్మీ కూడా తోడయింది అంటే బుల్లితెర షేక్ అయిపోవాల్సిందే. వీరిద్దరూ కలిసి పెర్పామ్ చేసిన ఎపిసోడ్లకు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు రాని రేటింగ్ వచ్చిందంటే వీరికి ఎలాంటి క్రేజ్‌, రేంజ్‌ ఉందో తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ – రష్మి ఇద్దరు కూడా బుల్లితెర‌పై కుమ్ముతున్నారు.

అయితే, సుధీర్ ఓ పక్క జబర్దస్థ్ చేస్తూనే మరోపక్క ఈవెంట్స్..అలాగే సినిమాలు దానితోపాటు..శ్రీదేవి డ్రామ కంపెనీలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమ్మలోనే రీసెంట్ గా ఓ కమెడియన్ సుధీర్ పై చేసిన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

కాగా రీసెంట్ వచ్చేవారానికి సంబంధించిన శ్రీదేవి డ్రామ కంపెనీ ప్రోమో ని రిలీజ్ చేసారు టీం. ఈ షోకు గెస్ట్ లుగా సెబాస్టియన్ సినిమా టీం మెంబర్స్ వచ్చారు. ఇక ఈ క్రమ్మలోనే పంచ్ ప్రసాద్ తన స్కిట్ ఎలా ఉందని కిరణ్ అబ్బవారని అదగా మధ్యలోకి ఎంటర్ అవుతాడు సుధీర్..దీంతో ప్రసాద్ మాత్ళాడుతూ..ఉండవయ్య బాబు నేనేదో ఆఫర్ల కోసం నా తిప్పలు నేను పడుతుంటే మధ్యలో నువ్వు వచ్చి..నాకు ఇలా కూడా అవకాశాలు రానివ్వవా” అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తారు. దీంతో ఈ ప్రోమోని ఇంట్రెస్టింగ్ గా ఎడిట్ చేసారు టీం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news