Moviesఆ రోజు కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ పై పడ్డ బాలీవుడ్ హాట్...

ఆ రోజు కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ పై పడ్డ బాలీవుడ్ హాట్ బ్యూటీ కళ్లు..!

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తన అధ్బుతమైన టాలెంట్ తో నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నమ్మి ఇచ్చిన పాత్రకు న్యాయం చేసే ఎన్టీఆర్ అంటే డైరెక్టర్ లకు ఓ ప్రత్యేకమైన అభిమానం..ఇష్టం. అందుకే చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. డిరెక్టర్స్ నే కాదు..చాలా మంది హీరోయిన్లు కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాడానికి ఆశక్తి చూయిస్తుంటారు.

ఎప్పుడెప్పుడు ఆయనతో నటించే అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. ఈ విషయం వాళ్ళే చాలాసార్లు పలు ఇంటర్వ్యులు ద్వారా..కొందరు సోషల్ మీడియా ద్వార తెలియజేశారు, అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో కి చేరిపోయింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. తన అంద చందాలతో కుర్రాళ్లను మైమరపించే దీపికా కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే కాకుండా కోలీవుడ్, ఇంకా టాలీవుడ్ ల నుంచి కూడా ఈమెకు అనేక ఆఫర్లు అనేవి వస్తుంటాయి. తాజాగా దీపికా పదుకొనే మాట్లాడిన మాటాలు చూస్తుంటే టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్నట్లుంది.

స్టార్ హీరోలంతా ఈ బ్యూటీని తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలని భావిస్తుంటే..అమ్మడు కళ్ళు మన తెలుగు హీరోల పై పడింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సినిమా ‘గెహ్రైయాన్’ రొమాంటిక్ లవ్ స్టోరిగా ఈ విడుదలకు రెడీగా ఉంది. ‘గెహ్రైయాన్’ సినిమా అమెజాన్ లో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది.

ఇప్పటి వరకు మీరు నటించిన హీరో తో పని చేయాల్సి వస్తే ఏ ఇండియన్ స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్న దీపకాకు ఎదురవ్వగా..ఆమె సెకండ్ కూడా ఆలోచించకుండా.. టక్కున అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్లు చెప్పింది. ఎన్టీఆర్ డాఇలాగ్ డెలివరి బాగుంటుందని చెప్పిన దీపికా తారక్ డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోని అని చెప్పుకొచ్చింది. ఇక పుష్ప సినిమా చూసి బన్నీకి ఫ్యాన్ అయిపోయాను అంటూ చెప్పుకొచ్చిన ఆమె ఆయనతో నటించాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news