Moviesస‌మంత ఆస్తులు ఇంత త‌క్కువా... షాకే..!

స‌మంత ఆస్తులు ఇంత త‌క్కువా… షాకే..!

సినిమా వాళ్లు అంటేనే ఆస్తుల‌కు, అంత‌స్తుల‌కు లోటు ఉండ‌ద‌నే అనుకుంటారు. అయితే సినిమా వాళ్ల‌లో అంద‌రి జీవితాలు ఒకేలా ఉండ‌వు. కొంద‌రి జీవితాలు పైకి చాలా క‌ల‌ర్ ఫుల్‌గా ఉన్నా లోప‌ల మాత్రం చాలా క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉంటాయి. కొంద‌రు ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత స్టార్‌డ‌మ్ అనుభ‌వించినా వాళ్ల‌కు ఒక్కోసారి తిన‌డానికి తిండి కూడా లేక‌పోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌హాన‌టి సావిత్రి ఎంత స్టార్‌డ‌మ్ అనుభ‌వించిందో.. ఆమె జీవిత చివ‌రి క్ష‌ణాలు ఎంత విషాదంగా ముగిశాయో మ‌న‌కు తెలిసిందే.

ఇక ఇప్పుడు మ‌రో స్టార్ హీరోయిన్ స‌మంత గురించి కూడా ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె ప‌దేళ్ల పాటు సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో అయితే ఆమెకు పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. అంద‌రి స్టార్ల‌తో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్ల కాపురం త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడాకులు ఇచ్చేసి అక్కినేని కోడుల బ్రాండ్‌ను తుంచేసుకుంది.

ఆ త‌ర్వాత కూడా ఆమె వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకు పోతోంది. బ్రేకప్ తరువాత చాలా గాసిప్‌లు వ‌చ్చాయి. స‌మ‌త‌కు చైతు రు. 200 కోట్ల ప్రాప‌ర్టీస్ ఇచ్చాడ‌ని.. ఇలా మ‌రిన్ని కోట్లు పోగేసుకుంద‌ని కొంద‌రు ఆడిపోసుకున్నారు. అయితే అస‌లు వాస్త‌వాలు వేరే అంటున్నారు. చైతుతో విడాకుల త‌ర్వాత పంతానికి పోయిన ఆమె ఒక్క రూపాయి కూడా భ‌ర‌ణం తీసుకోలేద‌ట‌. ఈ పంతం, ప‌ట్టుద‌లే విడాకుల వ‌ర‌కు వ‌చ్చింద‌ట‌.

అంద‌రు అనుకుంటున్న‌ట్టు స‌మంత ఇప్పుడు చైతు నుంచి తీసుకున్న డూప్లెక్స్ ప్లాట్‌లో ఉండ‌డం లేదు. అద్దె ఇంట్లో ఉంటోంది. ఆ డూప్లెక్స్ ప్లాట్‌ను చైత‌న‌మ్మ అమ్మేశాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. చైతు జూబ్లిహిల్స్‌లో సొంత ఇల్లు క‌ట్టుకుంటున్నాడు. అస‌లు చైతు – స‌మంత ఈ ఇంట్లోకి మారి.. అక్క‌డే కాపురం చేయాల‌నుకుంటోన్న స‌మ‌యంలోనే అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు స‌మంత అద్దె ఇంట్లో ఉంటోంది. ఓ ప్లాట్ కొనుక్కునే ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ట‌.

అయితే స‌మంత‌కు సొంతంగా చెన్నైతో పాటు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులో అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వాటిపై పెద్ద‌గా వ‌చ్చే ఆదాయం అయితే ఉండ‌ద‌ట‌. హైద‌రాబాద్‌లోని ఎస్ఎల్ఎన్ క్లాంప్లెక్స్ లో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీ నుంచే కాస్త అద్దెల రూపంలో ఆదాయం వ‌స్తుంద‌ట‌. ఆమె దూకుడు సినిమాకు ముందు వ‌ర‌కు చేసిన సినిమాల‌కు పెద్ద‌గా రెమ్యున‌రేష‌న్లు లేవు.

ఆ త‌ర్వాత మాత్ర‌మే ఆమె కాస్త ఆస్తులు పోగేసుకుంద‌ట‌. అయితే మ‌ధ్య‌లో ఆమె ఒక‌ర్ని బాగా న‌మ్మి అత‌డి చేతిలో ఫైనాన్షియ‌ల్ వ్య‌వ‌హారాలు అన్ని పెట్ట‌డంతో దెబ్బ‌తిన్న‌ట్టు కూడా తెలుస్తోంది. ఆ త‌ర్వాత జాగ్ర‌త్త ప‌డ్డాకే ఆమె కాస్తో కూస్తో ఆస్తులు కూడ‌బెట్టుకుంది. ఇక గుణ‌శేఖ‌ర్ శాకుంతం సినిమా పూర్తి చేసిన స‌మంత ఇప్పుడు య‌శోద సినిమా ఫినిష్ చేసే ప‌నిలో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news