Moviesనోరు తెరిచి అడిగిన ఆలియా..బన్నీ ఒప్పుకుంటాడా..?

నోరు తెరిచి అడిగిన ఆలియా..బన్నీ ఒప్పుకుంటాడా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేనా బన్నీ కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది. బన్నీ యాస్టింగ్ రష్మిక అందాలు సుకుమార్ డైరెక్షన్ వల్ల ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. అఫీషియల్ గా 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు . అయితే పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి.

ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంతేనా పుష్ప సినిమాలోని స్టెప్పులను వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రీజినల్ మూవీగా విడుదలై నేషనల్ లెవెల్లో వాసూళ్లు కురిపించిన ఈ చిత్రం బడా సెలబ్రిటీల నుండి కూడా పాజిటివ్ కామెంట్స్ ను దక్కించుకుంది. ఇప్పతికే చాలా మంది సెలబ్రిటీలు ఈ సినిమా పై బన్నీ యాక్టింగ్ పై వాళ్ల స్టైల్లో స్పందించగా..రీసెంట్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేసింది.

ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..రీసెంట్ గానే ఫ్యామిలీ మొత్తం పుష్ప సినిమా చూశారని. బన్నీ పర్ ఫామెన్స్ కు ఫిదా అయిపోయారని. బన్నీ యాక్టింగ్ కు ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టానికి బాగా మెచ్చుకున్నారని చెప్పిన అమ్మడు..మరో ఇంట్రెస్టింగ్ విషయాని బయట పెట్టేసింది. నన్ను ఇంట్లో ఆలూ అని పిలుస్తారు అని చెప్పిన అలియా.. పుష్ప సినిమా చూసిన తరువాత నా కుటుంబ సభ్యులు, ఆలూ.. అల్లుతో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్?’ అని ఆటపట్టిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం చెప్పుతూనే నేను బన్నీ తో నటించడానికి రెడీ అన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ఆలియా, మొహమాటం లేకుండా బన్నీతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యింది. మరి బన్నీ ఆమెకు అవకాశాం ఇస్తారో లేదో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news