Moviesఆ తెలుగు కుర్ర‌ హీరోను స‌మంత ఆటాడుకుందిగా... !

ఆ తెలుగు కుర్ర‌ హీరోను స‌మంత ఆటాడుకుందిగా… !

సీనియ‌ర్ హీరోయిన్ సమంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా చైతుతో విడాకుల త‌ర్వాత స‌మంత మ‌రింత‌గా రెచ్చిపోతోంది. ఇటు సినిమాల మీద సినిమాల‌కు, వెబ్‌సీరిస్‌ల‌కు కూడా ఓకే చెప్పేస్తోంది. ఇక చైతుకు ఇండ‌స్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువ‌. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స్నేహితుల గురించో లేదా త‌న సినిమాల గురించో పోస్టులు పెడుతూనే ఉంటారు.

తాజాగా స‌మంత యంగ్ హీరో తేజ స‌జ్జ ఫొటోల‌పై త‌న‌దైన మార్క్ కామెంట్ చేయ‌డంతో పాటు తేజ‌ను ఓ ఆటాడుకుంది. ఇటీవ‌ల తేజ స‌జ్జ త‌న కొత్త ఫొటో ష‌ట్‌కు చెందిన రెండు ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆ ఫొటోల‌కు స‌జ్జా `ఎక్స్ క్యూజ్ మీ లేడీస్` అంటూ క్యాప్షన్ పెట్ట‌డంతో పాటు వాటిని డైరెక్ట‌ర్ నందినిరెడ్డికి ట్యాగ్ చేశాడు. దీంతో స‌మంత ఒక్క ఫొటో కోసం ఆహ్‌.. అంత ఈజీ అనుకున్నావా ? మ‌నం అత‌డికి ఏం నేర్పించ‌లేమా ? అని స‌ర‌దాగా నందినీరెడ్డిని ఏసేసుకుంది.

స‌మంత కామెంట్ చూసిన తేజ మీరు నా మొత్తం స్వాగ్‌ను నాశ‌నం చేసేశారుగా అంటూ ఫ‌న్నీగా ఫీల‌వుతూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ రెండు కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక తేజ స‌జ్జ విష‌యానికి వ‌స్తే బాల‌న‌టుడిగా పలు సినిమాలు చేసి ఆ త‌ర్వాత హీరోగా ప్ర‌మోట్ అయ్యాడు. స‌మంత‌తో క‌లిసి ఓ బేబి సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ సాన్నిహిత్యం కార‌ణంగానే ఆమెతో స‌ర‌దాగా సంభాషించాడు.

ప్ర‌స్తుతం తేజ హ‌నుమాన్ సినిమా చేస్తున్నాడు. ఇక స‌మంత ఇటీవ‌లే శాకుంతలం సినిమా పూర్తి చేసి య‌శోద సినిమా చేస్తోంది. ఇక తమిళంలో కార్తీ స‌ర‌స‌న మ‌రో సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్‌లో రెండు వెబ్‌సీరిస్‌ల‌తో పాటు హాలీవుడ్ సినిమా కూడా చేస్తోంది. కోలీవుడ్‌లోనే విజయ్ సేతుపతి సరసన `కథువకుల రెండు కాదల్` అనే సినిమా కూడా చేస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Teja Sajja (@tejasajja123)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news