Moviesఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా... న‌ట‌సింహంకు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా..!

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా… న‌ట‌సింహంకు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా..!

బాల‌య్య జోరు మీదున్నాడు.. ఇంకా చెప్పాలంటే ఇటీవ‌ల కాలంలో కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత స్పీడ్‌తోనూ, ఫామ్‌లోనూ ఉన్నాడు. అఖండ త‌ర్వాత అంద‌రూ వ‌రుస‌పెట్టి స్టార్ డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేస్తున్నాడు. బోయ‌పాటి అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి బాల‌య్య‌తో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. ఇక ఇప్పుడు బాల‌య్య లైన‌ప్‌లో మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ యాడ్ అయ్యాడు. ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు కొర‌టాల శివ‌.

టాలీవుడ్‌లో రాజ‌మౌళి స్టైల్లోనే ప్లాప్ అన్న ప‌దం ఎరుగ‌కుండా అన్ని సూప‌ర్ హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు కొర‌టాల శివ‌. ప్ర‌స్తుతం కొర‌టాల శివ మెగాస్టార్ చిరంజీవి – రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ఆచార్య సినిమా వ‌స్తోంది. ఈ సినిమా పూర్తి చేసిన కొర‌టాల ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ప‌నుల్లో బిజీ అయ్యాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య‌తో సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలోనే బాల‌య్య‌కు కొర‌టాల ఓ క‌థ చెప్పాడు. అయితే ఆ క‌థ‌కు బాల‌య్య ఎస్ చెప్పాడా ? నో చెప్పాడా ? అన్న‌ది తెలియ‌దు కాని.. ఇప్పుడు ఆ క‌థ‌తోనే బాల‌య్య – కొర‌టాల శివ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించే అవ‌కాశాలున్నాయి. 2023 స్టార్టింగ్‌లో ఈ సినిమా ప‌ట్టాలు ఎక్కుతుంద‌ని అంటున్నారు.

కొర‌టాల లెక్క‌లు కొర‌టాల‌కు ఉన్నాయి. ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తిస్టార్ హీరోతో సినిమా చేయాల‌న్న టార్గెట్‌తో ఉన్నాడు. ఇక క్లాస్ ట‌చ్చింగ్‌తో ఉండే కొర‌టాల‌.. మాస్ హీరో అయిన బాల‌య్య‌తో ఏ క‌థ‌తో సినిమా చేస్తాడు ? ఆ క‌థ ఏంట‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. ఏదేమైనా ఈ కాంబినేష‌న్ సెట్ అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రో లెవ‌ల్లో ఉండ‌డం ప‌క్కా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news