Moviesకొడుకు కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్న సునీత-రామ్..త్వరలోనే అద్దిరిపోయే గుడ్...

కొడుకు కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్న సునీత-రామ్..త్వరలోనే అద్దిరిపోయే గుడ్ న్యూస్..?

సింగర్ సునీత..ఈమె గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్స్ కే అసూయ పుట్టించే అందం..అంతకుమించిన ముధురమైన స్వరం. అమృతం లాంటి గాన మాధుర్యం సింగర్‌ సునీత సొంతం. ఆమె తీయ్యటి గొంతుతో ఒక పాట పాడితే.. మనసుకు హాయిగా ఉంటుంది. స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత అనే చెప్పాలి. ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్లకుండా సైలెంట్ గా తన పని తానూ చేసుకుపోయే సింగర్ సునీత అంటే ఇష్టం లేని వారుండరు.

టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పలకడానికే కష్టంగా ఉండే లైన్లను కూడా ఆమె ఏమాత్రం తత్తరపాటు లేకుండా అవలీలగా పాడేసి సింపుల్‌ అనిపించేస్తుంది. సినిమా ఫ్లాప్ అయిన ఈమె పాటకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చేది. అంతలా ఆమె పాటలకు అభిమానులు ఉన్నారు.

టాలీవుడ్ ఫేమస్ సింగర్ సునీత ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పోయిన యేడాది మొదట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న్ సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సునీత రెండో వివాహాం చేసుకోవడంపై కొంత మంది పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ కొద్దిగా ఎత్తి పొడిచారు. కానీ ఆమె చేసింది కరెక్ట్ అంటూ చాలా మంది ఆమెను ఆశీర్వదించారు. ఇక పెళ్ళి తరువాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సునీత మరోసారి నెట్టింత టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

ఇక తాజాగా ఆమె కుమారుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. సునీత కుమారుడు ఆకాష్ త్వరలో టాలీవుడ్‌లో లీడ్ యాక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు సంచలనంగా మారాయి.సునీత కొడుకు ఆకాష్.. ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆకాష్ హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఇందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయని ఇన్‌సైడ్ టాక్.

సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆకాష్ ఇప్ప‌టికే త‌న చ‌దువును పూర్తి చేసుకుని న‌ట‌న‌లో మెళకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం. ఇండస్ట్రీ పరంగా అటు సునీతకు, ఇటు రామ్ వీరపనేనికి మంచి సంబంధాలు ఉన్న కారణంగా సునీత ..తన కొడుకు ఆకాష్ కోసం పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసిన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రకారం చూసుకుంటే త్వరలో ఆకాష్‌ గ్రాండ్ డెబ్యూ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం పై ఇప్పతివరకు అటు సినీత కానీ ఇటు రామ్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి చూడాలి ఈ విషయం పై సునీత ఎలా రీయాక్ట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news