Moviesటాప్ హీరోయిన్ల నుంచి లిప్‌కిస్‌లు కొట్టేస్తోన్న కుర్ర హీరోలు... మామూలు పండ‌గ...

టాప్ హీరోయిన్ల నుంచి లిప్‌కిస్‌లు కొట్టేస్తోన్న కుర్ర హీరోలు… మామూలు పండ‌గ కాదుగా..!

లిప్‌లాక్ అంటే మ‌న‌కు బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అమీర్‌ఖాన్‌, ఇమ్రాన్ హ‌ష్మీ, ఇక సౌత్‌లో క‌మ‌ల్‌హాస‌న్ లాంటి వాళ్లు గుర్తుకు వ‌స్తారు. అయితే ఇటీవ‌ల కాలంలో సినిమాలో హాట్‌నెస్‌, గ్లామ‌ర్ డోస్ పెంచేందుకు యువ‌హీరోలు అంద‌రూ హీరోయిన్ల‌తో లిప్‌కిస్‌లు కానిచ్చేస్తున్నారు. యువ హీరోయిన్లు సైతం ఛాన్సుల కోసం, పాపుల‌ర్ అయ్యేందుకు లిప్‌లాక్‌లు ఇచ్చేందుకు రాజీప‌డడం లేదు. గ‌తంలో లిప్‌లాక్‌లు ఉన్నా చాలా ప‌ద్ద‌తిగా ముద్దు పెట్టుకున్నారా ? లేదా ? అన్న‌ట్టుగా ఉండేవి. అయితే ఇప్పుడు అవి హ‌ద్దులు మీరిపోయాయి. లిప్‌లాక్ సీన్లు ఏకంగా బెడ్‌రూమ్ సీన్ల‌కు ధీటుగా.. ఘాటుగా ఉంటున్నాయి.

ఇక టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి వ‌స్తోన్న మూడు సినిమాల్లోనూ ఘాటైన లిప్‌లాక్ సీన్లు ఉన్నాయి. ఈ పొంగ‌ల్ అంతా లిప్‌లాక్‌ల పొంగ‌ల్ కానుంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు సోద‌రుడి కుమారుడ ఆశీష్ రౌడీబాయ్స్ సినిమాతో హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. అలాగే ఈ సంక్రాంతికే మ‌రో యంగ్ హీరో కూడా డెబ్యూ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మేన‌ళ్లుడు గ‌ల్లా అశోక్‌.

అటు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు అశోక్‌కు కుమారుడు. హీరో టైటిల్‌తో వ‌స్తోన్న అశోక్ తొలి సినిమాతో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక ఈ రెండు సినిమాల ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యాయి. ట్రైల‌ర్స్‌లోనే ఈ డెబ్యూ హీరోలు లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయారు. రౌడీబాయ్స్ హీరో ఆశీష్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో లిప్‌కిస్ ఇస్తూ రెచ్చిపోయాడు. అటు అశోక్ గ‌ల్లా కూడా హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌తో ఘాటైన చుంబ‌నంతో చేల‌రేగాడు. ఈ రెండు సినిమాల లిప్‌కిస్‌ల ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

విచిత్రం ఏంటంటే అశీష్ కంటే వ‌య‌స్సులో పెద్ద‌ది అయిన అనుప‌మ అక్క‌డ లిప్‌కిస్ ఇవ్వడం.. ఇటు స్టార్ హీరోయిన్‌గా ఉన్న నిధి కూడా డెబ్యూ హీరో అశోక్‌తో అద‌ర చుంబ‌నం ఇవ్వ‌డం హాట్ టాపిక్‌లే. ఇక మ‌రో సినిమా డీజే టిల్లు కోసం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో క‌లిసి హీరోయిన్ నేహాశెట్టి కూడా లిప్‌కిస్ చేసిన ఫొటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి నుంచి వాయిదా ప‌డింది. ఇక ఈ క్రిస్మ‌స్‌కు వ‌చ్చిన శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాలో హీరో నాని కృతిశెట్టికి కూడా లిప్‌కిస్ ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news