Moviesసమంత రూట్ లోనే తమన్నా..ఆ హీరోతో అలా..త్వరలోనే గుడ్ న్యూస్..?

సమంత రూట్ లోనే తమన్నా..ఆ హీరోతో అలా..త్వరలోనే గుడ్ న్యూస్..?

నాగచైతన్య తో విడాకుల అనంతరం సమంత కెరీర్ పై ఫోకస్ పెట్టింది. వరుసగా వస్తున్న ఆఫర్లను వద్దు అనకుండా సైన్ చేస్తుంది. అది డబ్బు కోసమో లేక బిజీ గా ఉండాలనే ఓపినియన్ తో చేస్తుందో తెలియదు కానీ బడా బడా సినిమాలకు సంతకం చేస్తూ..మరో నాలుగేళ్లు ఖాళీ లేని కాల్ షీట్లు నింపుకుంది. ఇక రీసెంట్ గానే సమంత ఎవ్వరు ఊహించని విధంగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అభిమానులకు దిమ్మ తిరిగేలా చేసింది. ఇక ఊ అంటావా మావ ఊ ఊ అంటావ మావ పాట ఎంతటి హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. సినిమాలోని అన్నీ పాటలకన్నా కూడా ఈ ఓఅటనే హైలెట్ గా నిలిచి వరల్డ్ నెం 1 ఎక్కువ మంది విన్న పాటగా చరిత్ర సృష్టించింది.

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సమంత మాదిరిగానే ఐటెం సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ గని సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ను చేయడానికి ఒప్పుకుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అమ్మడు అందాల ఆరబోతలను చూసేందుకు ఫ్యాన్స్ మరోసారి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఐటెం సాంగ్ ను మించి ఉండేలా ఈ పాటను ప్లాన్ చేసుకుంటున్నారట మూవీటీం. స్టెప్స్ విషయంలో కానీ హాట్ డ్రెస్ విషయంలో కానీ ముఖ్యంగా ఎక్స్ పోజింగ్ మ్యాటర్ లో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ తమన్నాతో ఇరగదీసే పర్ ఫామెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒక్కవేళ ఇదే నిజం అయితే అమ్మడు సమంతను దాటెసి మంచి మంచి ఆఫర్లు పడుతుందనడంలో సందేహమే లేదు అంటున్నారు ఫ్యాన్స్. మరి కొంతమంది అభిమానులు అయితే తమన్నా ఇలా సినిమాలు చేసుకుంటూనే ఉంటదా .. పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ వినిపించే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news