Moviesవామ్మో..శ్యామ్ సింగ‌రాయ్ విల‌న్ ఇంత తోపా ..?

వామ్మో..శ్యామ్ సింగ‌రాయ్ విల‌న్ ఇంత తోపా ..?

నిజం చెప్పాలంటే గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నానికి అస్సలు హిట్ నే లేదు. కరువు ప్రాంతంలో ఉన్న ప్రజలు మమల్ని ఆదుకోవడానికి ఎవరు వస్తారా అని ఎదురు చూసిన్నట్లు నాని ఫ్యాన్స్ కూడా మా హీరో ఎప్పుడు హిట్ కొడతాడా అని వెయిట్ చేసారు. ఎట్టకేలకు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ పుణ్యమా అంటూ నాని ఖాతలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. రీసెంట్ గా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నానికి జోడీగా కృతి శెట్టి – సాయిపల్లవి నటించగా.. మడోన్నా సెబాస్టియన్ లాయర్ రోల్ లో కనిపించి అదరగొట్టేసింది. కలకత్త బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా శ్యామ్‌సింగరాయ్‌ ను డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చింది. శ్యాం సింగ‌రాయ్ సినిమా మాత్రం తొలిరోజు నుంచే అదిరిపోయే హిట్ టాక్ తెచ్చుకుంది. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని నటన… దేవదాసు పాత్రలో సాయి పల్లవి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, రాహుల్ డైరెక్షన్, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి.

ఇక ఈ సినిమాలో నటించిన విలన్ టోటల్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. ఆ ఎత్తు ఆ లుక్ ఆ కోపం దేవదాసిలను పెట్టే చిత్రహింసలు..ఇవన్నీ చూస్తుంటే ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్ధమౌతుంది. ఈ సినిమాలో విలన్ గా నటించిన ఆయన పేరు మ‌నీష్ వాద్వా. మ‌నీష్ మొద‌ట‌గా డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా త‌న కెరీర్ ను మొద‌లు పెట్టి..ఆ తరువాత సీరియల్ ల్లో నతించిన ఈయ‌న ..ఆ తరువాత బాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో నటించి తనదైన స్టైల్లో మెప్పించి.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పై కన్నేశాడు. ఇప్పుడు ఈయన చేతిలో రెండు బడా సినిమాలు ఉందడం గమనార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news