Moviesఅసలు బిట్ మిస్ చేసిన సుకుమార్..రెచ్చిపోయిన సమంత..!!

అసలు బిట్ మిస్ చేసిన సుకుమార్..రెచ్చిపోయిన సమంత..!!

ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒక్కటే పాట వినపడుతుంది. అదే ..”ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ”..సాంగ్. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ గా రిలీజ్ అయిన ఈ పాట నెట్టింట దుమ్మురేపుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాట పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏకంగా వరల్డ్ నెం 1 సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. విడాకుల తరువాత సమంత మొదటిసారి తెర పై కనిపించడం..అందులోను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో కనిపించడం..ఇక కెరీర్ లోనే ఫస్ట్ టైం సమంత ఐటెం సాంగ్ చేయడం ..ఇలా ఈ పాటకు ఓవర్ హైప్ క్రియేట్ చేసాయి.

నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌తో క‌లిసి ఒక స్పెష‌ల్ సాంగ్‌లో స‌మంత స్టెప్పులేస్తుంద‌ని తెలియ‌గానే ఫ్యాన్స్ ఎంతో షాక‌య్యారు. ఇప్పటివ‌ర‌కు తన కెరీర్ లో ఒక్క ఐటెం సాంగ్ కూడా చేయని స‌మంత‌.. పుష్ప‌లో స్పెష‌ల్ సాంగ్‌కు ఓకే చెప్ప‌డంతో ఇది ఎలా ఉండ‌బోతుందో చూడాల‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు మూవీలో పాట చూశాక సమంత భరితెగించేసింది అని కొందరు కామెంట్స్ చేస్తే.. పెళ్లైన ఆడదేనా అంటూ మరికొందరు కామెంట్స్ చేసారు. ఇదంతా నెగిటివ్ సైడ్..పాజిటివ్ టాక్ వస్తే సమంత పై హాట్ కామెంట్స్ నే వినాలి. హాట్ లుక్స్ తో బన్నీతో వేసిన స్టెప్పులు మరేహీరోయిన్ కూడా చేయలేదు అనే అంటున్నారు ఫ్యాన్స్.

ఇక రీసెంట్ గా ఈ పాట ఫుల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే ధియేటర్ లో మనకు చూయించేటప్పుడు ఈ పాటలోని ఒక్క బిట్ కట్ చేసారు. సెన్సార్ ప్రాబ్లం నో..లేక నిడివి ఎక్కువైపోతుందని అనుకున్నారో తెలియదు కానీ సమంత హాట్ బిట్ ని ఎడిట్ చేసారు. ఇక యూట్యూబ్ లో రిలీజ్ చేసిన పాటలో మాత్రం ఫుల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఇక ధియేటర్స్ లో మిస్ అయిన్ బిట్ ను అభిమానులు యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news