Moviesఎన్టీఆర్ పక్కన ఆ ముద్దుగుమ్మ..కొరటాల టెస్టే వేరబ్బా..?

ఎన్టీఆర్ పక్కన ఆ ముద్దుగుమ్మ..కొరటాల టెస్టే వేరబ్బా..?

అన్నీ బాగుంటే ఈ టైంకి మనం ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసి ఎంజాయ్ చేసే వాళ్లం . కానీ ఏం చేద్దాం. మాయదారి కరోనా మనల్ని పట్టి పీడిస్తుంది. దీంతో కొన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను మళ్లీ అమలు లోకి తీసుకొచ్చాయి. ఇక ఫైనాన్స్ పరంగా ఆలోచించి..బడా బడా సినిమాలు వెనక్కు తప్పుకున్నాయి. దీంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయ్యింది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హై బడ్జెట్ మూవీ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ఇప్ప‌టికే ణ్టృ 30 సినిమా పై ఫోక‌స్ పెట్టారు. స్క్రిప్ట్ ప‌నిని పూర్తి చేసేసి…సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక‌వైపు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆచార్య సినిమా కూడా ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. దీంతో ఒక వైపు తార‌క్‌.. మ‌రో వైపు కొర‌టాల శివ ఫ్రీ అయ్యారు. దీంతో వారు త‌మ కాంబో మూవీకి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఎన్టీఆర్‌, కొర‌టాల శివ సినిమాను ఫిబ్ర‌వ‌రిలో లాంఛనంగా ప్రారంభిస్తార‌ట‌. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేస్తున్నార‌ట‌.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన నేషనల్‌ క్రష్‌ రష్మిక హీరోయిన్ గా చేయనుందట. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ఈ చిత్రంలో పాన్ ఇండియా మూవీ చేసిన రష్మిక అయితే సినిమాకి ప్లస్ అవుతుంది. మరోవైపు రష్మిక ఎన్టీఆర్‌ జోడీ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నారట కొరటాల.

ఇప్పటికే ఎన్టీఆర్‌ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే, కియరా అద్వానీ, అలియా భట్ పేరులు వినిపించగా..రీసెంట్ గా రష్మిక ను ఫైనల్ చేసాడట కొరటాల. ప్రస్తుతం రష్మిక మందన్న పేరుతెలుగు ఇండస్ట్రీలో ఎలా మార్మోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వరసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలతో మెల్లమెల్లగా జోడీ కడుతూ వస్తున్న రష్మిక.. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన కూడా నటిస్తే అమ్మడు క్రేజ్ మరింత పెరిగిపోయినట్లే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news