Moviesఆ ఫోటో కారణంగా హెబ్బా అభిమానులు హర్ట్ అయ్యారట..ఇది మామూలు పిచ్చి...

ఆ ఫోటో కారణంగా హెబ్బా అభిమానులు హర్ట్ అయ్యారట..ఇది మామూలు పిచ్చి కాదుగా..?

హెబ్బా పటేల్… తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హెబ్బా ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. హెబ్బా పటేల్..తన అందంతో,తన నటనతొ ఎంతో మంది కుర్రకారుని ఫిదా చేసింది. టాలీవుడ్ కి రాహుల్ రవీంద్ర హీరోగా వచ్చిన ‘అలా ఎలా” అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. తనదైన స్టైల్లో నటిస్తూ అభిమానుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇక రాజ్ తరుణ్ హీరో గా నటించినాకుమార్ 21ఎఫ్’ మూవీతో హెబ్బా పటేల్‌కి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత ‘ఈడో రకం ఆడో రకం’, ‘అంధగాడు’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,’ఏంజెల్’, ‘మిస్టర్’, ’24 కిస్సెస్’ వంటి సినిమాల్లో నటించింది. చిన్న తనంలోనే ఇండస్ట్రీకి రావడం, దానికి తగ్గట్టు ఎలాంటి కష్టాలు లేకుండా అవకాశాలు రావడం, పైగా మెచ్యూరిటీ లేకపోవడంతో ఏది పడితే అది చేసిందట. అయితే ఈ క్రమంలో తాను ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది అని, అలాగే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను అని.. ఇప్పుడు ఈ ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకున్నాను అని, అనుభవం నేర్పిన పాఠాలతో మళ్ళీ కెరీర్ ను స్టార్ట్ చేస్తాను అని చెప్పుకొచ్చింది హెబ్బా.

నిజానికి హెబ్బా పటేల్ అనేక సినిమాల్లో నటించినా ఆమెను సి గ్రేడ్ హీరోయిన్ గానే గుర్తిస్తున్నారు. అదే ‘కుమార్ 21F’ సినిమా విడుదల తరువాత హెబ్బా అంటే, ఒక గౌరవం ఉండేది, కానీ ఆ సినిమా తరువాత ఆమె నటించిన ఏ సినిమా ఆమెకు పేరు తీసుకురాలేదు. నితిన్ నటించిన ‘భీష్మ’ వంటి సినిమాల్లో ఐటమ్ పాత్ర చేయాల్సి వచ్చింది. అయినా కానీ అమ్మడుకి సోషల్ మీడియాలో క్రేజ్ మాత్రం తగ్గలేదు. దీంతో అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ.

ఇక అమ్మడు పొస్ట్ చేసిన ఫోటో చూసి అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యారట. హెబ్బా అంటే ఎప్పుడు హ్యాపీ,నవ్వుతూ, అల్లరి చేస్తూ క్యూట్ గా కనిపించాలి అంటే కానీ ఇలాంటి డీగ్లామరస్ ఫోటోలు పెట్టడం ఏంటి అని మడిపడుతున్నారు. ఎప్పుడు మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తూ హాట్ హాట్ ఫోజుల్లో స్కిన్ షో చేస్తూ తీసుకున్న హెబ్బ ఇలాంటి డీ గ్లామర్ ఫొటో షేర్ చేసే సరికి అభిమానులు బాగా హర్ట్ అయ్యారట. ఇక దీని పై మరి కొంత మంది ఘాటుగా స్పందిస్తున్నారు..ఆమె ఫోటో ఆమె ఇష్టం మధ్యలో వీళ్ళ బాధ ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు..మరీ ఫ్యాన్స్ ను ఇంతగా హర్ట్ చేసిన హెబ్బా త్వరలో మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news