Moviesహాట్‌బ్యూటీ ' శ్రీరెడ్డి ' ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. !

హాట్‌బ్యూటీ ‘ శ్రీరెడ్డి ‘ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. !

హాట్‌బ్యూటీ శ్రీరెడ్డి ఈ పేరు తెలుగు జ‌నాల నోళ్ల‌లో గ‌త మూడు నాలుగేళ్ల‌లో ఎంత‌గా నానుతుందో చూస్తూనే ఉన్నాం. అస‌లేం మాత్రం ఎవ్వ‌రికి తెలియ‌ని శ్రీరెడ్డి ఒక్క‌సారిగా కాంట్ర‌వ‌ర్సీ క్వీన్‌గా మారి మీడియాలోనూ, అటు సోష‌ల్ మీడియాలోనూ నానా ర‌చ్చ ర‌చ్చ క్రియేట్ చేస్తూ ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయింది. శ్రీరెడ్డి ఏం చేసినా, ఏం చెప్పినా కూడా వినేందుకు ఆమెకు ప్ర‌త్యేక‌మైన అభిమానులు కూడా వ‌చ్చేశారు. సినిమాల గురించి అయినా, రాజ‌కీయాల గురించి అయినా ఆమె మ‌న‌సులో ఏం ఉందో దానిని బోల్డ్‌గా అయినా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఆమె వీడియోల‌కు యూట్యూబ్‌లో ఎంత క్రేజ్ ఉందో వ్యూస్, కామెంట్సే చెపుతాయి. ఇక శ్రీరెడ్డి ఇటు హైద‌రాబాద్లో ఉండ‌డంతో పాటు అటు చెన్నైలో కూడా ఉంటోంది. దీంతో చాలా మందికి ఆమె ఆస్తులు బాగానే కూడ‌బెట్టుకుంద‌ని.. ఆమె ఖ‌రీదైన అపార్ట్‌మెంట్లు, కార్లు ఉన్నాయ‌ని అనుకుంటున్నారు. దీనిపై ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. యాంక‌ర్ మీకు హైద‌రాబాద్‌లో రెండు డ‌బుల్‌, త్రిబుల్ బెడ్ రూం ప్లాట్లతో పాటు బీఎండ‌బ్ల్యూ, ఆడికార్లు ఉన్నాయ‌ట క‌దా ? అని ప్ర‌శ్నించాడు.

అయితే ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇచ్చిన శ్రీరెడ్డి త‌న‌కు హైద‌రాబాద్‌లో మాత్ర‌మే సొంత ఇళ్లు ఉంద‌ని.. ఓ ఆడీ కార్ ఉంద‌ని చెప్పారు. మిగిలిన ఆస్తులు ఏవీ లేవ‌న్నారు. తాను ఇప్పుడు చెన్నైలో అద్దెకు ఉంటోన్న ఇళ్లు ఓ అపార్ట్‌మెంట్‌లో చాలా చిన్న‌ద‌ని చెప్పింది. ఈ మ‌ధ్య కాలంలో తాను పోగేసుకుంది కూడా ఏం లేద‌ని శ్రీరెడ్డి చెప్పింది. పేరెంట్స్ స‌పోర్ట్ లేని అమ్మాయిల‌కు సొంత ఇళ్లు అయినా ఉండాల‌ని.. రేప‌టి రోజున ఎవ‌డో ఒక‌డు వ‌చ్చి నువ్వు అలా..ఇలా చేస్తున్నావ్ ఇళ్లు ఖాళీ చేయ్ అనిపించుకునే బాధ ఉండ‌ద‌ని చెప్పింది.

ఇక తాను ఇంట్లో చాలా స్వేచ్ఛ‌గా ఉంటాన‌ని.. త‌న‌కు న‌చ్చిన బ‌ట్ట‌లు వేసుకుని ఉంటాన‌ని.. రాజ‌కీయ పార్టీల విష‌యంలో కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తూ ఉంటాన‌ని శ్రీరెడ్డి చెప్పింది. ఇలాంటి స‌మ‌యంలో త‌న‌కు సొంత ఇళ్లు లేక‌పోతే ఖ‌చ్చితంగా తాను అద్దెకు ఉండే ఇంటిని ఖాళీ చేయించేస్తార‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news