Moviesబాల‌య్య భార్య వ‌సుంధ‌ర ఎవ‌రి కూతురు.... ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

బాల‌య్య భార్య వ‌సుంధ‌ర ఎవ‌రి కూతురు…. ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

బాల‌య్య కొన్ని విష‌యాల్లో చాలా స్ట్రిక్ట్‌.. ఆయ‌న త‌న ప‌నేదో తాను చేసుకుపోయే టైం. సినిమాల విష‌యంలో అయినా, బ‌య‌ట విష‌యాలు అయినా బాల‌య్య ఇత‌రుల విష‌యాల్లో పెద్ద‌గా జోక్యం చేసుకోరు. అలాగే ఏ విష‌యంలో అయినా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇక హీరోగా ఎలా రూల్స్ ఫాలో అవుతారో ? ఓ తండ్రిగా, ఓ భ‌ర్త‌గా కూడా ఆయ‌న ఆద‌ర్శంగానే ఉంటారు. తాను గ్లామ‌ర్ ఫీల్డ్‌లో ఉన్నా త‌న కుమార్తెలు, భార్య అస‌లు సినీ ఫంక్ష‌న్ల‌లో ఎక్క‌డా క‌న‌ప‌డ‌రు.

ఇక బాల‌య్య భార్య వ‌సుంధ‌ర విష‌యానికి వ‌స్తే ఆమె కోటీశ్వ‌రుల కుమార్తె. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య‌కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావుకు సంబంధం చూడ‌మ‌ని చెప్ప‌డంతో నాదెండ్ల కాకినాడ‌లో ఉన్న ఆయ‌న బంధువుల ద్వారా ఈ సంబంధం చూశారు. బాల‌య్య పెళ్లి చూపుల‌కు వెళ్లి వ‌సుంధ‌ర న‌చ్చ‌డంతో ఓకే చేసుకున్నారు. బాల‌య్య ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో వ‌సుంధ‌ర ఇంటికి ప‌రిమితం కావ‌డంతో పాటు కుటుంబ వ్య‌వ‌హారాలు అన్ని ఆమే చక్క‌పెట్టేది.

వీరి వివాహం 1982లో అయ్యింది. వ‌సుంధ‌ర గ్రాడ్యుయేష‌న్ పూర్త‌యిన వెంట‌నే ఆమె బాల‌య్య‌ను పెళ్లి చేసుకుంది. వ‌సుంధ‌ర ఎవ‌రో కాదు శ్రీరామ‌దాసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్స్ అధినేత దేవ‌ర‌ప‌ల్లి సూర్యారావు కుమార్తె. బాల‌య్య – వ‌సుంధ‌ర దంప‌తుల‌కు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని కుమార్తెల‌తో పాటు కుమారుడు మోక్ష‌జ్ఞ ఉన్నారు. ఇక బాల‌య్య త‌న ఇద్ద‌రు కుమారుల‌కు కూడా మంచి సంబంధాలు చేశారు. బాల‌య్య పెద్ద‌ల్లుడు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌. ఇక బాల‌య్య చిన్న‌ల్లుడు మొతుకుమిల్లి శ్రీభ‌ర‌త్ ఎవ‌రో కాదు కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు కూతురు కుమారుడు.. అటు మాజీ ఎంపీ, దివంగ‌త ఎంవీవీఎస్ మూర్తి కొడుకు కుమారుడు.

బాల‌య్య‌తో పాటు ఆయ‌న అల్లుళ్లు ఇద్ద‌రూ కూడా రాజ‌కీయాల్లోనే ఉన్నారు. ఇక బాల‌య్య కుమారుడు మోక్ష‌జ్ఞ వెండితెర‌పై హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇక బాల‌య్య తాజాగా అఖండ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న బాల‌య్య బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షోతో టాపు లేపుతున్నాడు. ఇక ఇప్పుడు మ‌లినేని గోపీచంద్‌, అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వాల్లో వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news