Moviesమ‌హేష్‌కు న‌మ్ర‌త కంటే ఆమె చేతి వంటే బాగా ఇష్ట‌మా... ఎవ‌రో...

మ‌హేష్‌కు న‌మ్ర‌త కంటే ఆమె చేతి వంటే బాగా ఇష్ట‌మా… ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను – మహర్షి – సరిలేరు నీకెవ్వరు లాంటి హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఇప్పుడు మహేష్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ ప‌ర‌శురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారువారి పాట‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్ తర్వాత తెలుగు సినిమా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న‌ మహేష్ బాబు – రాజమౌళి సినిమా పట్టాలు ఎక్క నుంది. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌ఫై కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోకి దిల్ రాజును నిర్మాణ భాగస్వామిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు – ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో ? కోటీశ్వరుడు ప్రోగ్రాం కి వచ్చి అనేక విషయాలు ముచ్చటించారు.

ఈ క్రమంలోనే తనకు తన అమ్మమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం అని చెప్పారు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర పెరగడంతో అమ్మమ్మ వండే వంటలు అంటే తనకు ఎంతో ఇష్టమని… ఇప్పుడు ఆమె లేకపోవడంతో అవన్నీ తాను మిస్ అయిపోతున్నాను అని మహేష్ … తన అమ్మమ్మతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఉప్పు, కారం లేకుండా ఉన్న వంటలు మాత్రమే తింటూ ఉంటున్నాన‌న్నాడు.

ఇక తనకు బాగా ఇష్టమైంది హైదరాబాద్ బిర్యానీ అని మహేష్ చెప్పాడు. అలాగే నువ్వు కూడా బాగా తింటావు కదా ఆ విషయం నాకు తెలుసు అని… ఎన్టీఆర్‌ను కూడా సరదాగా ఆట పట్టించాడు. ఇక మహేష్ అమ్మమ్మ స్వగ్రామం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాకకు సమీపంలో ఉన్న ముసళ్ల‌మడుగు. ఇక మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా మంచి ఆహారపు ప్రియుడు అని… ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఎక్కువగా తినే వారిని కూడా ఈ సందర్భంగా మహేష్‌తో ఎన్టీఆర్‌ ప్రస్తావించాడు.

ఇక ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా వస్తుండడంతో ఇప్పుడు ఎన్టీఆర్ – మహేష్ బాబు అభిమానులు… తమ ఇద్దరు అభిమాన హీరోల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా వస్తే చూసేందుకు రెండు కళ్లు చాలవు అని… మా కోరిక ఎప్పుడు తీరుతుందో ? అని వెయిట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news