Moviesషూటింగ్‌లోనే క‌మ‌ల్ చెంప చెళ్లుమ‌నిపించిన స్టార్ హీరోయిన్‌..!

షూటింగ్‌లోనే క‌మ‌ల్ చెంప చెళ్లుమ‌నిపించిన స్టార్ హీరోయిన్‌..!

కమలహాసన్ లోకనాయకుడుగా కీర్తిగడించిన కమల్ నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో భారతదేశ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన కమల్‌కు కేవలం తమిళంలో మాత్రమే కాదు… తెలుగు, కన్నడం, మలయాళంతో పాటు అటు నార్త్ ఇండియాలోనూ భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. కమల్ నటించిన భారతీయుడు సినిమా ఆయనకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడంలో కమల్‌హాస‌న్‌కు ఆయనే సాటి. సుదీర్ఘ కాలం సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్న కమల్ తమిళనాడులో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. కమల్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. కోయంబత్తూరు సౌత్‌ నుంచి పోటీ చేసిన కమల్ కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించలేదు. రాజకీయాల సంగతి ఎలా ? ఉన్నా సినిమాల పరంగా ఎప్పటికీ క్రేజీ హీరోనే. ప్రస్తుతం కమల్ ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్ – అక్షర హాసన్ కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఒక సినిమా షూటింగ్ స్పాట్ లో ఓ స్టార్ హీరోయిన్ కమలహాసన్ చెంప చెల్లుమనిపించింద‌ట‌. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమని. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హీరోగా శుభ సంకల్పం సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ప్రేక్షకులు… విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో కమల్ పక్కన ఆమ‌నీ, ప్రియ రామన్ హీరోయిన్లుగా నటించారు.

ఓ సన్నివేశంలో ఆమని కమల్ చెంపమీద కొట్టాల్సి ఉంటుంది. ఆమని కమల్ చెంపమీద జస్ట్ టచ్ చేసి వదిలేస్తున్నారు. ఈ సీన్ కోసం కె.విశ్వనాథ్ ఎన్నో టేకులు తీసుకున్నారట.. అయితే చివరికి విశ్వనాధ్ సీరియస్ అవడంతో ఆమని కమల్ చెంపపై గట్టిగా కొట్టడంతో అప్పుడు షార్ట్ ఓకే అయ్యిందట. ఈ సీన్ షూటింగ్ అయ్యాక కమల్ ఆమ‌ని దగ్గరికి వచ్చి అమ్మ చెంపమీద కొట్టడం అంటే నెమ్మదిగా కొట్టాలి… కానీ అలా చాచిపెట్టి కొడతారా ? అనడంతో ఆమని టెన్షన్లో అలా కొట్టాను సార్ అని.. సారీ చెప్పిందట.

ఇక ఆమని ప్రేమ వివాహం చేసుకొని చెన్నైలో ఉంటోంది. ఆమని హిందువులు కాగా… ఆమె భర్త క్రిస్టియన్. వీరి పెళ్లికి పెద్దలు ముందు అభ్యంతరం వ్యక్తం చేసినా… ఆ తర్వాత ఒప్పుకున్నారని అని ఆమ‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news