Moviesఅలా చేసి మంచిప‌ని చేసావ్ మ‌హేష్..బన్నీ ఫ్యాన్స్ ను రెచ్చకొడుతున్నారుగా..?

అలా చేసి మంచిప‌ని చేసావ్ మ‌హేష్..బన్నీ ఫ్యాన్స్ ను రెచ్చకొడుతున్నారుగా..?

స్టైలీష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా మూవీగా చేసిన చిత్రం పుష్ప. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా..హీరోయిన్ గా రష్మిక నటించించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక గత మూడు సంవత్సరాలుగా అభిమానులను ఊరిస్తూ వచ్చిన ఈ పుష్ప సినిమా నిన్న థియేట‌ర్ల లో రిలీజ్ అయ్యి ఓ మోస్త‌రు టాక్ అయితే వ‌చ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ బ‌న్నీని మాస్ హీరోగా ప్ర‌జెంట్ చేయ‌డంలో సుక్కు స‌క్సెస్ అయ్యాడు అని మాత్రం చెప్పగలం.

ఇక సినిమా లో అందరికన్న బ‌న్నీ క్యారెక్ట‌రైజేష‌న్ నే బాగుంది అన్న టాక్ వినిపిస్తుంది. ఇక సమంత పర్ ఫామెన్స్ సూప‌ర్బ్ గా ఉంద‌నే చెపుతున్నారు. బ‌న్నీ క్యారెక్ట‌ర్ కు తోడు ర‌ష్మిక అందాలు, దేవిశ్రీ ప్రసాద్ పాట‌లు సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యం లో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ సినిమాని ఇంకా బాగా తెరకెక్కించుంటే బాగుండేది అన్న ఫీలంగ్ కొందరు జనాల్లో మిగిలిపోయింది.

ఫ‌స్టాఫ్ ను స్లోగా తీసుకెళ్లిన సుక్కు ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో వ‌చ్చే ఫైట్ బాగా న‌డిపించాడు… ఆ త‌ర్వాత సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక వ‌చ్చే ఫైట్ కూడా సినిమా కు హైలెట్‌ గా నిలిచింది.ఓవ‌రాల్ గా బ‌న్నీ ని అదిరి పోయే మాస్ ఎలివేష‌న్ల తో ప్ర‌జెంట్ చేయ‌డం లో సుక్కు బాగా స‌క్సెస్ అయ్యాడు. కానీ బ‌న్నీ అంటే ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్ ఉంటాయి. ఆ అంచనాలను సుక్కు రీచ్ కాలేకపోయాడు. దీంతో కొంతమేర నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ ని చూస్తుంటే బన్నీ అభిమానులను రెచ్చ కొడుతున్నట్లు తెలుస్తుంది.

నిజానికి ఫస్ట్ పుష్ప సినిమా ఆఫ‌ర్ అందుకుంది టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు. కానీ క్రియేటివ్ డిష‌రెన్స్ ల వ‌ల్ల మహేష్ బాబు ఈ సినిమాను రిజెక్ట్ చేసాడు అనే టాక్ వినిపించింది. కానీ సుకుమార్ పుష్ప సినిమాను బన్నీ తో అనౌన్స్ చేసాక మహేష్ బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పుతూ..” సుకుమార్ తో నేనొక్క‌డినే చేసాన‌ని ఆ సినిమా క‌ల్ట్ క్లాసిక్ గా నిలిచింద‌ని” ట్విట్ చేసాడు. కాగా కొందరు అభిమానులు ఆ ట్వీట్ ను ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు. అంతే కాకుండా పుష్ప కు నో చెప్పి మంచిప‌ని చేశావ్ అన్నా అంటూ మ‌హేష్ బాబు అభిమానులు అంటున్నారు. ఇక దీని పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తగ్గెదేలే అన్నట్లు కౌంట‌ర్లు ఇస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news