Moviesస్టార్ హీరో తమ్ముడితో ప్రేమాయణం..బడా ఫామిలీ ఇంటికి కోడలు కాబోతున్న అను...

స్టార్ హీరో తమ్ముడితో ప్రేమాయణం..బడా ఫామిలీ ఇంటికి కోడలు కాబోతున్న అను ఇమ్మానుయేల్ ..?

అను ఇమ్మానుయేల్ .. రవ్వంత అదృష్టం కూడా లేని హీరోయిన్. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్న ఇప్పటికి వరకు సరైన హిట్ పడలేదు ఈ భామకి. నాని నటించిన మజ్ను సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ అను ఇమాన్యుల్. మొదటి సినిమా మాత్రమే హిట్ అయ్యింది. మజ్ను సినిమాలో అమ్మడు అందానికి ,నటనకు ఫిదా అయినా..తరువాత వచ్చిన సినిమాలౌ అన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.దీంతో అమ్మడుని డైరెక్టర్స్ పట్టించుకోవడమే మానేసారు. తెలుగులో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలతో జత కట్టిన అను ఆ మధ్య కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి..సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కురాళ్ల మతిపొగొట్టింది.

ఇక చాలా కాలం తరువాత ఓ సినిమాలో అంటిస్తున్న అను..పక్కన హీరోగా నటిస్తున్నాడు అల్లు వారి అబ్బాయి శిరీష్. అప్పుడేపుడో 2013లో అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌ ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఇప్పటిదాకా ఒక్కటి అంటే ఒక్కటి కూడా సరైన హిట్ పడలేదు. ఇక ఆయన ఆశలనీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.

ఇక అను కి కూడా సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపఒ అన్నీ ఆశలు పెట్టుకుంది. ఇక వీళ్ళు జంట గా నటిస్తున్న “ప్రేమ కాదట” అనే చిత్రం ఫుల్ రొమాంటిక్‌ మూవీ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్‌ లుక్‌ సినిమా ఎంత హాట్ గా ఉంటూందో చెప్పేసింది. ఇందులో శిరీష్‌ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ను అద్దం చాటున ముద్దు పెడుతున్నట్లు ఉంది.

ఇక సినిమా కోసం కలుస్తున్నారో లేక మ్యాటర్ వేరే ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీకి వచ్చిన్ ఇన్నాళ్లు అయినా ఎలాంటి రూమర్స్‌ లేకుండా రాముడు మంచి బాలుడు అనే టైప్ లో ఉండే శిరిష్ పై కొత్త పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా హీరోయిన్‌ అను ఇమాన్యుయేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనికి బలం చేకూరేస్తూ ఇద్దరూ కలిసి కాఫీ షాపులు, పార్టీలు అంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. శిరీష్‌..ఇమాన్యుయేల్‌తో ఇంత క్లోజ్‌గా మూవ్‌ అవ్వడంతో వీరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్‌..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news