Moviesఉద‌యం లేచిన వెంట‌నే మందుకొట్టే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

ఉద‌యం లేచిన వెంట‌నే మందుకొట్టే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సినిమా హీరోయిన్ల‌లో మందు లేకుండా బ‌తికేవాళ్లు చాలా త‌క్కువ మందే ఉంటారు. ల‌గ్జరీ లైఫ్‌, చేతిలో కావాల్సినంత డ‌బ్బు ఉండడంతో వారు చేసే ఎంజాయ్‌కు అడ్డు అదుపు ఉండ‌దు. కెరీర్ బాగున్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌ని అనుకోవ‌డంతో పాటు వారు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ప‌బ్బులు, పార్టీలు, డిస్కోలు అంటూ చాలా త‌తంగాలే చేస్తుంటారు. ఇక నేటి త‌రం హీరోయిన్ల‌లో చాలా మంది మందు కొడుతూ ఉంటారు. వీరిలో కొంద‌రు ఓపెన్‌గానే చెపుతారు.. మ‌రి కొంద‌రు ప‌బ్లిక్‌గానే మందు కొడుతూ దొరికిపోతుంటారు.

చాలా మంది హీరోయ‌న్లు ఫుల్లుగా మందేడి రోడ్డెక్కి చేసిన ర‌చ్చ ర‌చ్చ‌లు మ‌నం చూశాం. మ‌రి కొంద‌రు అయితే ఉద‌యం లేవ‌గానే బ్రెష్ చేసుకోకుండానే మందు వేసేస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్ శృతీహాస‌న్ ఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌దు. అలాగే ఆమె తాగే విష‌యంలోనూ అలాగే ఉంటుంద‌ట‌. షూటింగ్‌లు లేక‌పోతే బెంగ‌ళూరు వెళ్లి మ‌రీ ప‌బ్బుల్లో తాగుతూ ఎంజాయ్ చేస్తుంద‌న్న టాక్ ఉంది.

ఇక సీనియ‌ర్ న‌టి ఊర్వ‌శి ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా కూడా ప‌బ్బుల్లో మందేసి చేసిన ర‌చ్చ ర‌చ్చ‌ను మ‌నం చాలా సార్లు చూశాం. ఇక చెన్నై చిన్న‌ది త్రిష కూడా ఎన్నోసార్లు ఫుల్లుగా తాగేసి ర‌చ్చ ర‌చ్చ చేయ‌డం చూశాం. అంతెందుకు ఆమె తాగిన మ‌త్తులో కారును స్పీడ్‌గా న‌డిపి పోలీసుల‌కు చిక్కింది. అయితే ఈ కేసు నుంచి త‌ప్పించుకునేందుకు ఆమె త‌న ప‌లుకుబ‌డి అంతా ఉప‌యోగించింది.

ఇక హ‌న్సిక సైతం తాగి న‌టించే సీన్ కోసం నిజంగానే తాగి వ‌చ్చి షూటింగ్ స్పాట్లో నానా ర‌చ్చ చేసింద‌ట‌. ఇక ఛార్మీ కౌర్ కూడా ప‌బ్లిక్‌గానే ప‌బ్బుల్లో ఉన్న‌ప్పుడు, ఆమె చేతిలో మందు గ్లాసు ఉన్న ఫొట‌ల‌తో చాలా సార్లు ద‌ర్శ‌నం ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news