Moviesబొబ్బిలిపులి షూటింగ్‌లో ఎన్టీఆర్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఇదే..!

బొబ్బిలిపులి షూటింగ్‌లో ఎన్టీఆర్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఇదే..!

దివంగత నటరత్న సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో బొబ్బిలి పులి ఒక‌టి. దర్శకరత్న దాసరి నారాయణరావు సవాల్‌ చేసి మరీ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. 1982 లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కి పునాది వేసింది అన్న ప్రచారం ఉంది. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకులు నందిన‌ హరిశ్చంద్ర రావు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఎన్టీఆర్ నటించిన మనుషులంతా ఒక్కటే సినిమాలో ఒక్క డ్యూయెట్ కూడా లేకుండానే హిట్ అయిందట. ఆ సమయంలో దాసరి నారాయణరావు గారిని చాలా మంది మెచ్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి స్ఫూర్తి క‌లిగించిన‌ సినిమా సర్దార్ పాపారాయుడు అయితే…. ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సిన ఉద్దేశం కలిగించిన సినిమా మాత్రం బొబ్బిలిపులి అని హరిచంద్ర రావు చెప్పారు.

ఇక ఆ సినిమా షూటింగ్ జరిగే సమయానికే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు మంత్రి గా ఉన్నారని చెప్పారు.
బొబ్బిలి పులి సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా చంద్రబాబు మంత్రి ప‌ద‌వి పోయింది అన్న విషయం ఎన్టీఆర్ కు తెలియడంతో వెంటనే షూటింగ్ ఆపాలని ఎన్టీఆర్ చెప్పారట. ఆ మరుసటి రోజు రామారావు గారు చాలా సీరియస్‌గా ఉన్నారు అని కూడా చెప్పారు.

ఇక బొబ్బిలి పులి షూటింగ్ పూర్తి అయిన వెంటనే పార్టీ పెట్టాలని ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇక ఆ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు కూడా సీనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించారట. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు బొబ్బిలి పులి సినిమాకు ముందుగా అభ్యంత‌రం చెప్పార‌ట‌. త‌ర్వాత అవాంత‌రాలు దాటుకుని ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news