Moviesసీనియ‌ర్ హీరో ముర‌ళీమోహ‌న్ ఇండ‌స్టీలోకి రాక‌ముందు అస‌లు పేరు ఇదే..!

సీనియ‌ర్ హీరో ముర‌ళీమోహ‌న్ ఇండ‌స్టీలోకి రాక‌ముందు అస‌లు పేరు ఇదే..!

టాలీవుడ్ సీనియర్ హీరో, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ 78 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా చెక్కు చెదరని అందంతో ఉన్నారు. మురళీమోహన్ మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగారు. మురళీమోహన్ సినిమా ఎంట్రీ విచిత్రంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలోని చాట‌ప‌ర్రు ఆయన స్వగ్రామం. ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజిలో సూపర్ స్టార్ కృష్ణ.. దర్శకుడు క్రాంతి కుమార్ తో కలిసి ఆయన చదువుకున్నారు. వీరిద్ద‌రు ఆయ‌న‌కు క్లాస్‌మెట్స్ మాత్ర‌మే కాదు.. బెంచ్‌మేట్స్ కూడా..!

చ‌దువు పూర్త‌యిన అనంతరం విజయవాడలో 10 సంవత్సరాల పాటు ఆయన వ్యాపారం చేశారు. ఈ సమయంలో మురళీమోహన్ ఎక్కువుగా చెన్నై వెళుతూ ఉండేవారు. ఆయ‌న సినిమా ఫ్రెండ్స్ అంద‌రూ… నువ్వు అందంగా ఉంటావ‌ని సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని ప్రశ్నించారు. ఆ తర్వాత మురళీమోహన్‌కు ఒక రోజు మేకప్ టెస్ట్‌ చేయడం… ఆయన వెంటనే సినిమాల్లోకి రావడం జరిగిపోయాయి.

ఇక మురళీమోహన్ అసలు పేరు రాజా రామ్ మోహన్ రావు. ఈ పేరును ఆయన తల్లిదండ్రులు పెట్టారట. అయితే ఆయన కాలేజ్ రోజుల్లో రాజా రామ్ మోహన్ రావు అనే పేరు పొడ‌వుగా ఉంద‌ని రాజ‌బాబుగా మార్చుకున్నారు. రాజ‌బాబు పేరుతోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తర్వాత పదేళ్ల పాటు వ్యాపారం చేసినప్పుడు కూడా రాజబాబు గాని ఆయన అందరికీ పరిచయం.

అయితే ఆయ‌న జ‌గ‌మేమాయ అనే సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ సినిమా ద‌ర్శ‌కుడు ఆయ‌న పేరు ఏంట‌ని అడిగారు. ముర‌ళీమోహ‌న్ త‌న పేరును రాజ‌బాబు అని చెప్పారు. అయితే అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో మాకు ఓ రాజ‌బాబు ఉన్నాడ‌ని ( క‌మెడియ‌న్ రాజ‌బాబు).. నీ పేరు ముర‌ళీమోహ‌న్ అని పెట్టుకుంటే బాగుంటుంద‌ని చెప్ప‌డంతో అప్ప‌టి నుంచి ఆయ‌న ముర‌ళీమోహ‌న్‌గా స్థిర‌ప‌డిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news