Movies"భోళా శంకర్‌" కోసం తమన్నా షాకింగ్ డెసిషన్.. అంత పెద్ద సాహసం...

“భోళా శంకర్‌” కోసం తమన్నా షాకింగ్ డెసిషన్.. అంత పెద్ద సాహసం చేస్తుందా..?

రీఎంట్రీ తరువాత చిరంజీవి వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ యంగ్ హీరోలకు తీసిపోకుండా టాలీవుడ్ లో తన స్టామినా చూపిస్తున్నారు. కొరటాల శివ తో ఆచార్య సినిమాను కంప్లీట్ చేసిన చిరు..ప్రస్తుతం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన ‘వేదాళం’ అనే సినిమా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను ఎప్పటినుండో తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే..లాస్ట్ కి చిరంజీవి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్ ను చిరంజీతో మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి  ‘భోళా శంకర్‌’ ఈ సినిమాను తెరకెక్కతుండగా.. సినిమాలో చిరు స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులో చాలా మార్పులే చేసారట.మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను మేక‌ర్స్ ఫైనల్ చేసి అఫిషియల్ గా ప్రకటించారు. న‌వంబ‌ర్ 11న మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమన్నా రోల్ కి అసలు ఇంపార్టెన్స్ ఏ ఉండదనే టాక్ మొదలైంది. కధ మొత్తం కీర్తి సురేష్ చిరంజీవి చూట్టూనే తిరుగుతుందట. తమన్నాని కేవలం ఒక్క సాంగ్ పరిమతం చేయనున్నారని తాజా సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇక అమ్మడు ఇక్కడ గ్లామర్ వలకబోసే ఛాన్స్ కూడా లేదట. కేవలం చిరంజీవి భార్య గా..కీర్తి సురేష్ కు వదిన గా స్క్రీన్ షేర్ చేసుకుంటుందట. ఇక్కడ షాకింగ్ ఎమిటంటే ఈ విషయాలు ముందే తమన్నాకు డైరెక్టర్ క్లారిటీగా చెప్పారట. తమన్నా ఈ సినిమాలో చిరంజీవి కోసమే నటిస్తుందట.అందుకే లీడ్ రోల్ కాకపోయినా అమ్మడు ఈ సినిమాను ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news