Moviesస్టార్ హీరో క‌జిన్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్‌..!

స్టార్ హీరో క‌జిన్‌తో స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్‌..!

బాలీవుడ్‌లో వ‌రుస‌పెట్టి సెల‌బ్రిటీల పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా అనుష్క రాంజాన్ – ఆదిత్య సీల్ జంట పెళ్లితో ఒక్క‌టి అయ్యింది. అలాగే రాజ్‌కుమార్ రావు – ప‌త్ర‌లేఖ పెళ్లిచేసుకున్నారు. ఇక విక్కీ కౌశ‌ల్ – క‌త్రినా కైఫ్ పెళ్లికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో సెల‌బ్రిటీ కూడా చేరిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా త్వ‌ర‌లోనే బాలీవుడ్‌కే చెందిన ఓ న‌టుడితో మూడు ముళ్లు వేయించుకోనుంద‌ని తెలుస్తోంది. ఆ న‌టుడు కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌కు క‌జిన్ కూడా..!

సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యుడితో డేటింగ్ చేస్తోందని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. స‌ల్మాన్ కుటుంబానికే చెందిన బంటి స‌చ్‌దేవ్‌తో సోనాక్షి పెళ్లి లాక్ అయ్యింద‌ని అంటున్నారు. బంటి ఎవ‌రో కాదు స‌ల్మాన్ త‌మ్ముడు సోహైల్ ఖాన్‌కు బావ అని తెలుస్తోంది. వీరిద్ద‌రు క‌లిసి ఇటీవ‌ల బాలీవుడ్‌లో ప‌లు పార్టీల్లో, ఫంక్ష‌న్ల‌లో క‌లుస్తున్నారు. మ‌రో టాక్ ప్ర‌కారం సోనాక్షి – బంటి స‌చ్‌దేవ్ ఇద్ద‌రూ పాఠ‌శాల ఫ్రెండ్స్ అని కూడా అంటున్నారు.

ఇటీవ‌లే సోనాక్షి తాను పాఠ‌శాల‌లో చ‌దువుకునే రోజుల్లోనే ఓ కుర్రాడితో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని… నా డిప్లోమా పూర్త‌యిన వెంట‌నే మా బంధాన్ని ముగించాన‌ని చెప్పింది. ఐదేళ్ల పాటు అత‌డితో ప్రేమాయ‌ణం కొన‌సాగించాన‌ని కూడా చెప్పింది. ఈ క‌నెక్ష‌న్ ఎవ‌రితో అని బాలీవుడ్ వ‌ర్గాలు ఆరా తీస్తే అత‌డే బంటి అని తేలింది. వీరి పెళ్లిపై రెండు కుటుంబాల నుంచి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన రానుంద‌ని తెలుస్తోంది.

ఇక సోనాక్షి స‌ల్మాన్ ప‌క్క‌న వ‌రుస‌గా ద‌బాంగ్ సీరిస్ సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు అత‌డినే పెళ్లాడుతుంద‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు స‌ల్మాన్ కుటుంబానికి చెందిన వ్య‌క్తినే పెళ్లాడ‌బోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news