Moviesవిడాకుల‌పై మ‌రోసారి ఓపెన్ అయిన స‌మంత‌.. మ‌రింత స్ట్రాంగ్‌గా..!

విడాకుల‌పై మ‌రోసారి ఓపెన్ అయిన స‌మంత‌.. మ‌రింత స్ట్రాంగ్‌గా..!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. టాలీవుడ్ దిగ్గజ ఫ్యామిలీ వారసుడు అయిన అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి పెళ్లాడిన స‌మంత నాలుగు సంవత్సరాలు కాపురం చేసింది. అయితే చైతు – సమంత మధ్య ఏర్పడిన చిన్న చిన్న గ్యాప్ పెద్దది కావడంతో వీరు కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చేశారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన అభిమానులకు పెద్ద షాక్‌ ఇచ్చారు.

చైతు – సమంత విడిపోవడం ఇప్పటికీ తెలుగు సినిమా అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. విడాకుల తర్వాత సమంత ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా వచ్చింది. ఆ షోలో స‌మంత‌ను చూసినవారు ఆమె చాలా కలత చెందినట్లు ఉందని చర్చించుకున్నారు. సమంతలో మునుపటి జోస్ అయితే ఉన్నట్టు లేదు.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో 2021 సంవత్సరం తనకు ఎంతో శాడ్‌ ఇయర్ అని చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో 2021 ఎలా గడిచిందో ఒక్క మాటలో చెప్పాలంటే సమంత మాత్రం ఈ సంవత్సరం తనకు సంక్లిష్టమైన సంవ‌త్స‌రం అని చెప్పింది. సౌత్ ఇండియా స్టార్స్ అంద‌రూ క‌లిసి పాల్గొన్న ఈ ఇంట‌ర్వ్యూ ఫుల్ వీడియో డిసెంబ‌ర్ 6న టెలీకాస్ట్ చేయ‌నున్నారు.

ఇక విడాకుల త‌ర్వాత ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు స‌మంత వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తూ వ‌స్తున్నారు. ఆమె ఓ హాలీవుడ్ సినిమాకు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె న‌టించిన శాకుంతలం సినిమా కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news