MoviesR R R నాటు నాటు హుక్ స్టెప్ వీడియో.. ఇంత...

R R R నాటు నాటు హుక్ స్టెప్ వీడియో.. ఇంత ఈజీగా ఈజీగా వేయొచ్చా..! (వీడియో)

టాలీవుడ్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. బాహుబలి ది కంక్లూజన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు ఉన్నాయి. పైగా టాలీవుడ్ లోనే క్రేజీ హీరోలు గా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావటంతో ఈ సినిమా ఎలా ? ఉంటుందా అని అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు… రామ్ చరణ్ అభిమానులు సైతం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇటీవల రిలీజైన నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాజమౌళి సైతం ఎవరి అంచ‌నాల‌కు అందకుండా సరికొత్తగా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇటీవ‌లే రిలీజ్ అయిన నాటు నాటు అనే ఊర మాస్ సాంగ్‌కు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్పులు సినిమాపై అంచనాలను ఆకాశంలోకి తీసుకు వెళ్ళి పోయాయి.

వీరిద్దరూ కలిసి వేసిన హుక్‌ స్టెప్ ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసేలా ఉంది. ఇక ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ తాజాగా యూట్యూబ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే ప్రతి ఒక్కరు ఎంత ఈజీగా హుక్ స్టెప్‌ చేయొచ్చో కూడా వివరించారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news