Moviesఅభిమానికి ప్రభాస్ ఖ‌రీదైన గిఫ్ట్..ఎందుకో తెలుసా..?

అభిమానికి ప్రభాస్ ఖ‌రీదైన గిఫ్ట్..ఎందుకో తెలుసా..?

ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా..చెప్పండి. ఆ హైట్టు ఆ వెయిట్.. అంతకన్న  మించిన గొప్ప మనసు..ఇవి చాలదా ఆయనను అభిమానులు ఆరాధించడానికి. బహుబలి తరువాత ఆయన రేంజ్ మారిపోయింది. వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ టీసుకుంటూ సౌత్ ఇండియాలో ఇంతవరకు ఏ హీరో తీసుకోని విధంగా పారితోషకాని అందుకుంటూ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఈయన ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.

ప్రభాస్ కు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఆయన అంటే పడి చ్చ్చిపోయే జనం బోలెడు మంది ఉన్నారు. ఇక ప్రభాస్ మీద ఉన్న ప్రేమను,అభిమానాన్ని ఎలా చెప్పాలో తెలియక ఓ వీరాభిమని చేసిన పనికి నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ మీద ప్రేమను వ్యక్తపరుస్తూ.. దానికి కోసం తన జుట్టంతా తీసేసి.. కేవలం ప్రభాస్ అనే అక్షరాలు మాత్రమే వచ్చేలా హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకున్నాడు. ఈ ఫొటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేయ‌గా..అవి ప్ర‌భాస్ కంట్లో ప‌డ్డాయి. అత‌డెవ‌రో తెలుసుకున్న ప్ర‌భాస్ ఏకంగా ఆ అభిమానిని త‌న ఇంటికి పిలిపించుకుని..పక్కన కూర్చోపెట్టుకుని ముచ్చటించారు.

అలా అభిమాని ప్రేమను చూసి ప్రభాస్ ఫిదా అయ్యాడు. అభిమానితో కాసేపు మనసు విప్పి మాట్లాడాడు. అనంతరం అభిమానికి ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్. కాస్ట్ లీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంతో అభిమాని షాక్ అయ్యాడు. ఇక తాను ఎంత‌గానో ఆరాధించే ఫేవ‌రేట్ యాక్ట‌ర్ ఇలా ఇంటికి పిలిపించుకోవ‌డమే కాకుండా ఖ‌రీదైన కానుక ఇవ్వ‌డంతో ఆ అభిమాని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news