Moviesనోరు కంట్రోల్ లో పెట్టుకో..స‌న్నీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దీప్తి సునైనా..?

నోరు కంట్రోల్ లో పెట్టుకో..స‌న్నీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దీప్తి సునైనా..?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్తేంట్స్ ఎలా ఉన్నా..బయట వాళ్లకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం అసలు తగ్గట్లేదు. గొడవపడి వాళ్ళు కలుసుకుంటున్నా..బయట నుండి వీళ్ళు మాత్రం ఇంట్లో ఉన్న వారి పై రెచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ టాస్క్‌లో తన టవర్‌ కాపాడుకుంటున్న తరుణంలో సన్నీ-సిరిలకు మధ్య జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే. సనీ సిరిలకు గొడవ జరుగుతుంటే సిరికి సపోర్ట్ గా షణ్నూ కలగజేసుకోవడంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో సన్నీ ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్‌ ఆడుతున్నావ్‌ అంటూ షన్ను పై రెచ్చిపోయాడు. దీనిపై షణ్నూ గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన కౌంటర్‌ రిప్లై ఇచ్చింది.

సోషల్ మీడియా వేదికగా ఆమె అభిప్రాయం తెలుపుతూ…‘అప్పడం అయిపోతావ్ అంటావా? నువ్వు బెస్ట్ అనుకో తప్పులేదు. మిగతా అందరినీ ఎందుకలా చూస్తున్నారు? చేతగాని ఆట ఏంటి? ఫిజికల్ అయి గట్టిగట్టిగా అరిస్తే ఆడినట్లా? ఫిజికల్ అవడం కన్నా మైండ్ గేమ్‌తో ఆడుతున్న షన్నూనే బెస్ట్. యూట్యూబ్ వరకే అంటారా? దాని వెనుక కష్టం తెలుసా’ అంటూ సన్నీని ఏకిపారేసింది. ఫిజికల్‌ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్‌ మైండ్‌తో ఆడటం. అది షణ్నూ వంద శాతం ఇస్తున్నాడు. బిగ్‌బాస్‌ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. ఎంత మెచ్యూర్‌గా బిహేవ్‌ చేస్తున్నాడు.

 

సిరి సపోర్ట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని షన్నూ గేమ్ ఆడుతున్నాడా? మరి మీకు కాజల్ సపోర్ట్ చేస్తే మేము అలాగే ఫీల్ అవుతున్నామా? అంటూ అదిగి కడిగి పారేసింది, షణ్ముఖ్ నాకు క్లోజ్ అన్నది పక్కన పెడితే వాడు బిగ్ బాస్‌లో ఎంతో మెచ్యూర్‌గా ఆడుతున్నాడు. చాలా హుందాగా కనిపిస్తున్నాడు ” అంటూ దీప్తి రాసుకొచ్చింది. చివర్ళో తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్‌ షణ్నూ..నిన్ను హగ్‌ చేసుకోవాలనుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెద్ద పోస్టే పెట్టింది దీప్తి. ఇక సీప్తీ నే కాదు సోషల్ మీడియాలో చాలా మది సనీ మాటల పై మండిపడుతున్నారు. సన్నీ నోరు కంట్రోల్ లో పెట్టుకుంటే మచిది అంటూ సలహాలు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news