Moviesషారుక్ ఖాన్ ల‌వ్ స్టోరీ వెన‌క ఇంత ట్విస్ట్ ఉందా..!

షారుక్ ఖాన్ ల‌వ్ స్టోరీ వెన‌క ఇంత ట్విస్ట్ ఉందా..!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రెండు ద‌శాబ్దాల పాటు బీ టౌన్‌లో తిరుగులేని ఫ్యామిలీ హీరోగా షారుక్ నిలిచాడు. షారుక్ న‌టించిన దిల్‌వాలే దుల్హేని లిజాయింగే ( తెలుగులో ప్రేమించి పెళ్లాడుతా) అయితే సంవ‌త్స‌రాల పాటు ఆడి భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే ఒకే థియేట‌ర్లో ఏ సినిమా ఆడ‌న‌న్ని రోజులు ఆడి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా రికార్డులు చ‌రిత్ర‌లో కూడా ఏ సినిమా బ్రేక్ చేసే ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి.

ఇక షారుక్ ఖాన్‌ది ప్రేమ వివాహం. షారుక్ త‌న భార్య గౌరీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడాడు. అయితే వీరి ల‌వ్‌స్టోరీ వెన‌క పెద్ధ క‌థే ఉంద‌ట‌. వీరిద్ద‌రు స్కూల్ డేస్ నుంచే ఫ్రెండ్స్ అట‌. షారుక్ ఇండ‌స్ట్రీలో ఎదిగాక ముందుగా గౌరీకి ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. అయితే ముందు గౌరీ త‌ల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. సినిమా హీరోను పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని గౌరీ తండ్రి చెపితే.. షారుక్‌ను మాత్రం తాను అల్లుడిగా ఒప్పుకోన‌ని త‌ల్లి చెప్పింద‌ట‌.

గౌరీ సోద‌రుడు అయితే ఏకంగా షారుక్ త‌ల‌కు గ‌న్ గురి పెట్టి త‌న సోద‌రిని వ‌దిలి వేయ‌క‌పోతే చంపేస్తాన‌ని కూడా బెదిరించాడ‌ట‌. అయినా షారుక్ మాత్రం ఏ మాత్రం వెనక్కి త‌గ్గ‌కుండా గౌరీతోనే తాను జీవితాంతం ఉంటాన‌ని చెప్పాడ‌ట‌. గౌరీఖాన్ త‌ల్లి అయితే వీరిద్ద‌రు ఎలాగైనా విడిపోవాల‌ని ఎంతో మంది జ్యోతిష్యుల‌ను సైతం క‌లిసింద‌ట‌. అయితే వీరిద్ద‌రు మొండి ప‌ట్టుద‌ల‌తో ప్రేమ‌లో ఉండ‌డంతో చివ‌ర‌కు వారే క‌న్వీన్స్ అయ్యి వీరి పెళ్లి చేశారు. ఇక షారుక్ ప్ర‌స్తుతం కోలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news